MULUGU | ఉరివేసుకొని యువకుడి మృతి

MULUGU | ఉరివేసుకొని యువకుడి మృతి

MULUGU | ఉరివేసుకొని యువకుడి మృతిఈ

– సోషల్ మీడియాలో ప్రశ్నించాడని పోలీసుల ఒత్తిడి..?

– కేసులు నమోదవుతాయనే నెపంతో ఆత్మహత్య

– ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంచల్వాయిలో విషాదం

– బంధువుల ఆందోళన

ములుగు ప్రతినిధి, జూలై3, తెలంగాణజ్యోతి : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికపై జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించిన గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామానికి చెందిన యువకుడు చుక్కా రమేష్ (24)ను పోలీసులు వేధించడంతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారని బంధువులు ఆరోపించారు. దీంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. యువకుడి మృతితో గ్రామస్థులు, మృతుని కుటుంబ సభ్యులు చల్వాయి 163జాతీయ రహదారిపై ఆందోళన చేయడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రమేష్ తల్లిదండ్రులు చిన్నప్పుడే మరణించడంతో తన అమ్మమ్మ వద్ద ఉంటూ పెరిగాడు. అయితే స్థానిక వాట్సప్ గ్రూపులో రమేష్ రెండు నెలలుగా ఇందిరమ్మ ఇండ్లపై పేదలకు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారని ఆరోపిస్తూ మెస్సేజ్ లు పంపుతూ ఆవేదన వెలిబుచ్చాడు. ఈ అంశంపై పలువురు పోలీసులకు ఫిర్యాదు చేయగా బుధవారం రమేష్ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు మరుసటి రోజు పోలీస్ స్టేషన్ కు రావాలని తెలిపారు. దీంతో తనపై అక్రమ కేసులు బనాయిస్తారనే తీవ్ర మనోవేదనకు గురై గురువారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనపై గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుని కుటుంబ సభ్యులు, పలువురు గ్రామస్థులు 163జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. ఇల్లు కోసం ప్రశ్నించాడన్న కారణంతో వ్యక్తిని బెదిరించడం, కేసులు నమోదు చేస్తానని చెప్పడంతో యువకుడు మృతిచెందాడని, అందుకు కారణమైన వారిని శిక్షించాలని, ఘటనపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించి విచారణ చేపట్టాలని, బీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి, మాజీ జడ్పీ చైర్ పర్సన్ బడే నాగజ్యోతి డిమాండ్ చేశారు. ఆందోళనకు మద్థతు తెలిపేం దుకు వెళ్తున్న క్రమంలో ఏటూరునాగారంలోనే నాగజ్యోతిని పోలీసులు అడ్డుకున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుల ను అణిచివేస్తున్నారని, ప్రజా ప్రభుత్వం అని చెప్పుకోవడం అవివేకమని ఆమె విమర్శించారు. యువకుడు రమేష్ ను మానసింగా వేధించి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిన వారిపై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యువత చావుతో సాధించేది ఏదీ లేదని, బతికి పోరాడి సమస్యను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. ఆమె వెంట మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్ తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment