బోనమెత్తిన జనం.. గ్రామ దేవత కు మొక్కులు
కాటారం, జూలై3,తెలంగాణ జ్యోతి : ఆషాఢమాసం బోనాల సీజన్ అయిన ఆది, గురువారాలలో పల్లెల్లో బోనాల సందడి నెలకొంది. భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా గురువారం గ్రామాల్లో ఇంట్లో ప్రత్యేక పాత్రలలో బోనం సిద్ధం చేశారు. మహిళలు బోనం ను నెత్తి పైన పెట్టుకొని మంగళ వాయిద్యాలతో ఇంటి నుండి ఊరేగింపుగా గ్రామ దేవత పోచమ్మ గుడికి తరలి వెళ్లి పసుపు కుంకుమ పూలతో పూజలు చేసి టెంకాయ కొట్టి బోనం తో నైవేద్యం సమర్పించారు. కోళ్లు, మేకల ను తల్లికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా కాటారం మండలం లో మహిళలు తలపై బోనం పెట్టుకొని డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా గ్రామ దేవత పోచమ్మ గుడికి వెళ్లి ప్రదక్షిణాలు చేసి మొక్కులు సమర్పించి చల్లంగా ఉండేల దీవించమని వేడు కున్నారు.