క్షణికావేశంలో యువకుడు ఆత్మహత్య
తెలంగాణ జ్యోతి, వెంకటాపురం నూగూరు ప్రతినిధి : బైక్ కొలివ్వలేదని క్షణికావేశంలో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ములుగు జిల్లా వాజేడు మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వాజేడు మండలం చండ్రుపట్లకు చెందిన నితిన్ (19) ఖరీదైన బైక్ కావాలని తల్లిదండ్రులను అడిగాడు. అంత స్థోమత లేదని వారు చెప్పడంతో మనస్థాపనికి గురై వారం కింద పురుగుల మందు తాగాడు. కుటుంబీకులు వరంగల్ లోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి మృతి చెందాడు.
1 thought on “క్షణికావేశంలో యువకుడు ఆత్మహత్య”