మెడికల్ షాప్స్ యూనియన్ జిల్లా కార్యదర్శిగా బచ్చు పూర్ణచంద్రరావు
వెంకటాపురం, నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా మెడికల్ షాప్స్ యూనియన్ ఎన్నికలు శుక్రవారం జిల్లా కేంద్రంలో జరిగాయి. ఈ ఎన్నికల్లో నూగూరు వెంకటాపురంకి చెందిన సత్యదేవ మెడికల్ షాప్ యజమాని బచ్చు పూర్ణచంద్రరావు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన వెంకటాపురం నుండి ఈ హోదాకు ఎన్నికవడం ఒక రికార్డుగా నిలిచింది. ప్రాదేశిక ప్రాతినిధ్యానికి ఇది గర్వకారణమని యూనియన్ సభ్యులు పేర్కొన్నారు. పూర్ణచంద్రరావును అభినందించినవారిలో ఆర్కే మెడికల్స్ రామకృష్ణ, ఆంజనేయ మెడికల్స్ దామోదర్, పార్వతి మెడికల్స్ రమేష్, శ్రీరామ మెడికల్స్ రాంకుమార్, అంకారావు, శ్రీనివాస్, రామ్మూర్తి, రాంబాబు, జయసింహ తదితరులు ఉన్నారు.