108 అంబులెన్స్ తనిఖీ– రికార్డుల పరిశీలన
వెంకటాపురం, జూన్ 26, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో గురువారం 108 అంబులెన్స్ వాహనాన్ని హైదరాబాద్ నుండి వచ్చిన ఆడిటింగ్ శాఖ అధికారి కిషోర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వాహనంలో ఉండవలసిన ఔషధాలు, రికార్డులు, మెడికల్ ఇండెంట్ స్టాక్ లను సమగ్రంగా పరిశీలించారు. అవసరమైన మార్పులు, మెరుగుదలలపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.ఈ తనిఖీలో ఈఎంటి రాజ్యలక్ష్మి, పైలట్ రాధాస్వామి, 108 వెంకటాపురం సిబ్బంది పాల్గొన్నారు.