నిషేధిత గుడుంబా పట్టివేత

నిషేధిత గుడుంబా పట్టివేత

నిషేధిత గుడుంబా పట్టివేత

– సమాచారం ఇచ్చిన వారికి పారితోషకం : ఎస్ఐ వెంకటేష్

కన్నాయిగూడెం, జూన్ 24, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా కన్నాయిగూడెం పోలీస్‌ స్టేషన్ పరిధిలోని ఏటూరు గ్రామంలో మంగళవారం రాత్రి నైట్ పెట్రోలింగ్ సమయంలో గుడుంబా అక్రమ సరఫరా వెలుగులోకి వచ్చింది. బుట్టయి గూడెంకు చెందిన దుర్గం గిరిబాబు నిషేధిత గుడుంబాను సరఫరా చేస్తున్నాడని గుర్తించిన ఎస్ఐ ఇ.వెంకటేష్, పోలీస్ బృందం రూ.6 వేల విలువైన గుడుంబాను పట్టుకొని కేసు నమోదు చేసారు. ఈ సందర్భంగా ఎస్ఐ వెంకటేష్ మాట్లాడుతూ బతకడానికి ఎన్నో మార్గాలు ఉన్నా కొందరు గుడుంబా సరఫరా చేయడం వల్ల అనేక కుటుంబాలు నాశనం అవుతున్నాయన్నారు. గుడుంబా వల్ల ప్రాణ నష్టం జరుగు తోందని, ఇది తీవ్రమైన నేరమన్నారు. అక్రమ గుడుంబా చట్ట వ్యతిరేకంగా సరఫరా చేసే వారిని ప్రజలు కనిపెట్టి 8712670139 లేదా 8712670089 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారాన్ని ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, వారికి తగిన పారితోషకం కూడా అందజేస్తామని ఎస్ఐ తెలిపారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment