రైతు భరోసాతో రైతుల్లో ఆనందోత్సాహం

రైతు భరోసాతో రైతుల్లో ఆనందోత్సాహం

రైతు భరోసాతో రైతుల్లో ఆనందోత్సాహం

– ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకంతో జేజేలు

వెంకటాపురం, జూన్24, తెలంగాణజ్యోతి:రైతు సంక్షేమానికి చిహ్నంగా మారిన “రైతు భరోసా” పథకంతో రాష్ట్రవ్యాప్తంగా రైతుల్లో ఆనందాంబరాలు నెలకొన్నాయి. ఈ సందర్భంగా ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, రైతులు సంబరాలు నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా పథకాన్ని ప్రారంభించి ప్రతి ఒక్క రైతు గుండెల్లో గూడు కట్టుకున్నారని స్థానిక నాయకులు తెలిపారు. ఖరీఫ్ వ్యవసాయ సీజన్‌ ప్రారంభంలోనే రైతులకు ఆర్థిక సహాయాన్ని అందించడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి మద్దతుగా నిలుస్తోందని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు, రైతులు కలిసి ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అంబేద్కర్ సెంటర్‌ వద్ద బాణాసంచా పేలుస్తూ “జై కాంగ్రెస్ – జై కాంగ్రెస్” నినాదాలతో మండల కేంద్రం మార్మోగింది. ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు జల్లిగంపల చక్రకళాధర్ నాయుడు, ములుగు జిల్లా కిసాన్ సెల్ సీనియర్ సభ్యులు ప్రముఖ రైతు పల్నాటి ప్రకాశరావు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్, పిఎసిఎస్ చైర్మన్ చిడెం మోహన్రావు, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మన్యం సునిల్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చిడెం సాంబశివరావు, నాయకులు బాల సాని వేణుగోపాల్, అధికార ప్రతినిధి శ్రీరాముల రమేష్, సుంకర రంగయ్య నాయుడు, మాజి ఎంపిటిసిలు రవి, సీతాదేవి, గుండమళ్ల కిరణ్, కే. శ్రీను, డర్రా రవి, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment