రోడ్డు భద్రతపై స్పెషల్ డ్రైవ్
– హెల్మెట్ లేని 600 మందికి జరిమానా
– రెండు రోజుల్లో రూ.87,200 ఫైన్ వసూలు
– జిల్లా ఎస్పీ శబరిష్
ములుగు ప్రతినిధి, జూన్21, తెలంగాణజ్యోతి : రోడ్డు భద్రత కార్యక్రమాల్లో భాగంగా ములుగు జిల్లా పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. కేవలం రెండు రోజుల్లో హెల్మెట్ ధరించని 600 మంది నుంచి రూ.87,200ల జరిమానాను వసూలు చేశారు. అందుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ డాక్టర్ పి.శబరీష్ మీడియాకు వివరించారు. ములుగు జిల్లాలో హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడిపిన 600 మందికి ఫైన్ వేశామని తెలిపారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లో పరిధిలో స్పెషల్ ట్రైన్ నిర్వహించామన్నారు. జిల్లాలో రోడ్డు భద్రత నియమాలపై ప్రజలకు వివిధ మాధ్యమాల ద్వారా, కార్యక్రమాల ద్వారా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. హెల్మెట్ ధరించక పోవడంతోనే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం Eyyజరిగినట్లు గుర్తించామని తెలిపారు. స్పెషల్ డ్రైవ్ ద్వారా 19న 186 మందికి రూ.27,800లు, 20న హెల్మెట్ ధరించని 414 మందికి రూ.59,400లు జరిమానా విదించడం జరిగిందన్నారు. ద్విచక్ర వాహన చోదకులు విధిగా హెల్మెట్ ధరించాలని, రోడ్డు భద్రత నియమాలను పాటించాలని సూచించారు. స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని తెలిపారు.