ఘనంగా అంతర్జాతీయ యోగా వేడుకలు
– హార్ట్ ఫుల్ నెస్ సంస్థ, బిజెపి ములుగు శాఖ ఆధ్వర్యంలో.
ములుగు ప్రతినిధి, జూన్21, తెలంగాణ జ్యోతి : జిల్లా కేంద్రం లోని సెయింట్ ఆంథోనీ స్కూల్లో భారతీయ జనతా పార్టీ ములుగు జిల్లా శాఖ, హార్ట్ పుల్ నెస్ సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. హార్ట్ ఫుల్ నెస్ శ్రీ రామచంద్ర మిషన్ సంస్థ శిక్షకురాలు ఒద్నాల మాధవి హాజరై ఈ అంతర్జాతీయ యోగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి యోగ సాధన ద్యానం చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యోగ ధ్యానం ప్రతి ఒక్కరికి నిత్య జీవితంలో అవసరమని,ప్రతిరోజు ఉదయం వేళలా కొంత సమయాన్ని కేటాయిస్తూ యోగా కార్యక్రమాలు నిర్వహించాలని, యోగ చేయడం వలన పలు రకాల వ్యాధులు రావని, ఆరోగ్యకరంగా ఉంటారని అన్నారు. యోగ చేయడం వలన వారి ఆయుషు పెరగడమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యకరంగా ఉంటారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ ములుగు జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం హాజరై, యోగా ప్రాముఖ్యతను వివరించారు. యోగా మనిషి శరీరానికి ఆరోగ్యాన్ని, మనస్సుకు శాంతిని, ఆధ్యాత్మికంగా ఎదుగుదలకూ మార్గదర్శకం. భారతీయ సంస్కృతిలో యోగా కి ఉన్న ప్రాధాన్యం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చేందుకు ప్రధాని నరేంద్రమోడీ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకరావడానికి కృషి చేసినారు అని అన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో హార్ట్ ఫుల్ నెస్ సంస్థకు సంబంధించిన శిక్షకులు ఒద్నాల శ్రీనివాస్, పడమటి నరేష్,అభ్యాసకులు మాకుల సంతోష్ , కృష్ణ , సంగ రంజిత్ కుమార్, యోగా డే జిల్లా కన్వీనర్ గాదం కుమార్, బిజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చింతలపూడి భాస్కర్ రెడ్డి, ఎస్టీ మోర్చా ప్రదాన కార్యదర్శి కొత్త సురేందర్, గుగులోతు స్వరూప, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీలమంతుల రవింద్రాచారి, జిల్లా కోశాధికారి గంగిశెట్టి రాజ్ కుమార్, రవి రెడ్డి , ములుగు మండల అధ్యక్షుడు రాయంచు నాగరాజు,మండల ప్రధాన కార్యదర్శులు రాజ్ కుమార్,పవన్ ,హేమాద్రి,శ్రీహరి, పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, సాధారణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని యోగా ఆసనాలు ప్రదర్శించారు.