ఎమ్మార్పీఎస్ జెండా గద్దె నిర్మాణానికి భూమి పూజ

ఎమ్మార్పీఎస్ జెండా గద్దె నిర్మాణానికి భూమి పూజ

ఎమ్మార్పీఎస్ జెండా గద్దె నిర్మాణానికి భూమి పూజ

కాటారం,జూన్21,తెలంగాణజ్యోతి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని గారెపెళ్లి ప్రధాన కూడలిలో ఎమ్మార్పీఎస్ జెండా గద్దె నిర్మాణానికి శనివారం భూమి పూజ నిర్వహించారు. మండల కేంద్రంలో జూలై 7వ తేదీన ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవాలని సామాజిక న్యాయం సాధించిన మందకృష్ణ మాదిగ ఆశయా లను నెరవేర్చడానికి మండలంలోని ఎమ్మార్పీఎస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి రుద్రారపు రామచంద్రం, కాటారం మండల అధ్యక్షులు మంతెన చిరంజీవి మాదిగ పిలుపునిచ్చారు. కాటారం మండలంలో ప్రతి గ్రామం లో ఎమ్మార్పీఎస్ జెండావిష్కరణ చేయాలని అన్నారు. మంతెన చిరంజీవి అధ్యక్షతన జెండా గద్దె నిర్మాణానికి టెంకాయ కొట్టి శ్రీకారం చుట్టారు. మందకృష్ణ మాదిగ ఆశయాలు కొనసాగి స్తామని జూలై 7వ తేదీన అన్ని వర్గాల ప్రజలతో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. భూమి పూజ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు చీపెల్లి చిన్ని సంతోష్, దేవేందర్, మహదేవపూర్ మండలాధ్యక్షులు బెల్లం కొండ సురేష్ మాదిగ పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment