జిల్లాలో మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం

జిల్లాలో మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం

జిల్లాలో మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం

 – మత్తు పదార్థాలు వాడినట్టు తెలిస్తే 1908 టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారం ఇవ్వాలి

– జిల్లా అదనపు కలెక్టర్ మహేందర్ జి  

ములుగు ప్రతినిధి, జూన్ 21, తెలంగాణ జ్యోతి: సమాజానికి పెను సవాలుగా మారిన మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల నిరోధానికి సంబంధిత శాఖల అధికారులు కలిసికట్టుగా కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ మహేందర్ జి అన్నారు. శనివారం జిల్లా అదనపు కలెక్టర్ కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫిరెన్స్ సమావేశ మందిరం లో జిల్లా స్థాయి మాదకద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశం నిర్వహించారు.  జిల్లాలో మాదకద్ర వ్యాల వినియోగం, రవాణా తదితర అంశాలపై సమావేశంలో చర్చించి, వాటి నియంత్రణకు చేపట్టాల్సిన చర్యల గురించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.  ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని అన్నారు. మాదకద్రవ్యాల వినియోగం, రవాణాపై గట్టి నిఘా పెడుతూ, వాటిని పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు అంకితభావంతో అధికారులు కృషి చేయాలని, ఇతర రాష్ట్రం సరిహద్దు మార్గం ద్వారా వీటిని రవాణా చేసే అవకాశాలు ఉన్నందున అధికారులు కటుదిటమైన చర్యలు చేపట్టాలని, తనిఖీ కేంద్రాల వద్ద గట్టి నిఘా ఉంచాలని సూచించారు. గంజాయి వంటి మత్తు పదార్థాలు ఎక్కడి నుండి జిల్లాకు చేరుతున్నాయి, ఏయే ప్రాంతాల్లో ఎవరు వీటిని విక్రయిస్తు న్నారు, ఏ ప్రాంతాలకు జిల్లా మీదుగా రవాణా జరుగుతోంది, జిల్లా లో ఎక్కడైనా గంజాయిని అంతర పంటగా సాగు చేస్తున్నారా అనే వివరాలకు పక్కాగా గుర్తిస్తూ, వాటి మూలాలను అడ్డుకోగలిగితే చాలా వరకు మత్తు పదార్థాల వినియోగాన్ని నియంత్రించవచ్చని, ఈ దిశగా పోలీస్, ఎక్సయిజ్, రవాణా తదితర శాఖలు సమన్వయంతో ముందుకెళ్లాలని, విద్యార్థులు మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల వాడినట్లు దృష్టి కి వస్తె వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1908 , కు తెలుపాలని, మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. అనంతరం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సమావేశం లో  ఈ సూర్యనారాయణ డి సి ఈ బి, సెక్రటరీ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీస్ ములుగు మోహన్ సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, ములుగు డాక్టర్ గోపాల్ రావు, జిల్లా వైద్య &ఆరోగ్య అధికారి, ములుగు దుర్గేశ్వర్, డిప్యూటీ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ ములుగు;కెసైదులు, డీఎస్పీ, టి ఎస్ ఏ ఎన్ బి, వరంగల్ బి. దుగ్నేశ్వర్, బి వై సి టి ఓ,ములుగు. సిహెచ్ రవీందర్ రెడ్డి, జిల్లా బిసి అభివృద్ధి అధికారి, ములుగు. పి. సురేష్, జూనియర్ అసిస్టెంట్, ఇంటర్మీడియట్ విద్య విభాగం, ములుగు శ్రీనివాస్ ములుగు ఎక్సైజ్ జిల్లా అధికారిలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment