సన్రైజర్స్ హైస్కూల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు
ములుగుప్రతినిధి, జూన్21, తెలంగాణ జ్యోతి : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లాలోని సన్రైజర్స్ హైస్కూల్లో యోగా వేడుకలను శనివారం పాఠశాల కరస్పాండెంట్ పెట్టెం రాజు అధ్యక్షత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ములుగు డీఎస్పీ రవీందర్, సీఐ సురేష్, ఎస్సై వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఎస్పీ రవీందర్ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవరచుకోవడానికి యోగా అమూల్యమైన సాధనమన్నారు. ఇది మానసిక ప్రశాంతతకు, శారీరక ఆరోగ్యా నికి తోడ్పడుతుందని, యోగా శరీరం, మనస్సు, ఆత్మకు మధ్య సమతుల్యతను కలిగించే ప్రాచీన భారతీయ సంప్రదాయ విధానమని, ప్రతి ఒక్కరూ యోగాను తమ జీవితంలో భాగంగా చేసుకోవాలని పేర్కొన్నారు. అదేవిధంగా“అభయమిత్ర” కమ్యూనిటీ కనెక్టివిటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. యువత మాదక ద్రవ్యాలకు బానిస కావొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపల్ బల్గూరి జనార్ధన్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.