కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలి

కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలి

కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలి

వెంకటాపురం, జూన్ 21, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో శనివారం శక్తి కేంద్ర సమావే శాన్ని బీజేపీ  మండల ఉపాధ్యక్షురాలు అంకాల దుర్గ ఆధ్వర్యం లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ 11 ఏళ్ల సుపరిపాలనలో దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగిందని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి తెలియజేయాలని కోరారు. అర్హులైన లబ్ధిదారులకు కేంద్ర పథకాలు చేరే విధంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు అనుబంధ సంఘాలు కృషి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పథకాలను తమ పథకాలుగా ప్రజల్లో తప్పుడు ప్రచారం చేస్తుండటాన్ని ఆమె తీవ్రంగా విరోధించారు. ఈ విషయంలో ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ సమావేశంలో మండల బీజేపీ అధ్యక్షుడు రామెళ్ల రాజశేఖర్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు బొల్లె సునీల్, మండల ఉపాధ్యక్షుడు తోటా సతీష్, సీనియర్ నాయకులు జల్లి గంపల లక్ష్మీపతి, చిట్టెం ఈశ్వర రావు, బూత్ అధ్యక్షులు కంపెల రవీందర్, గణేష్, సురేష్, సరోజినీ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment