అమ్మ మాట – అంగన్వాడీ బాట

అమ్మ మాట - అంగన్వాడీ బాట

అమ్మ మాట – అంగన్వాడీ బాట

– శారీరక, మానసిక వికాసానికి అంగన్వాడీ సేవలను వినియోగించుకోవాలి 

–అంగన్వాడి సూపర్‌వైజర్ మనోరమ

వెంకటాపురం, జూన్ 17, తెలంగాణ జ్యోతి : అంగన్వాడీ కేంద్రాల్లో అందించే సమతుల్యమైన పౌష్టికాహారం తీసుకోవడం వల్ల పిల్లలు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదుగుతారని ములుగు జిల్లా వెంకటాపురం సర్కిల్ అంగన్వాడీ సూపర్‌వైజర్ మనోరమ తెలిపారు. మంగళవారం మండలంలోని బర్లగూడెం గ్రామపంచాయతీ పరిధి జెల్లా కాలనీలో నిర్వహించిన అమ్మ మాట – అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని అంగన్వాడీ టీచర్ కొర్స సమ్మక్క ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్కిల్ సూపర్‌వైజర్ ఇన్‌చార్జ్ సీడీపీఓ మనోరమ మాట్లాడుతూ ప్రతి తల్లి తమ పిల్లలను అంగన్వాడీ కేంద్రానికి పంపించాలని సూచించారు. అక్కడ ప్రతిరోజూ పౌష్టికాహారం, ఆటపాటలతో విద్యాభ్యాసం, శారీరక పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. పౌష్టికాహారం వల్ల మాతా శిశు మరణాల రేటు తగ్గుతోందని, రక్తహీనత సమస్య నుండి బయట పడేందుకు దోహదపడుతోందని వివరించారు. బాలింతలు, గర్భిణులు, కిషోర బాలికలంతా అంగన్వాడీ సేవలు పూర్తిగా వినియోగించు కోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాయం విజయలక్ష్మి, రాజేశ్వరి, యేసమ్మ, ఏవి రమణతో పాటు పలువురు గ్రామస్థులు, బాలింతలు, గర్భిణులు, బాలికలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment