అమ్మ మాట.. అంగన్వాడి బాట…
ఐసీడీఎస్, సిడిపిఓ ప్రేమలత
ఏటూరునాగారం, జూన్ 10, తెలంగాణ జ్యోతి : మండలం లోని దొడ్ల, మల్యాల, కొండయి, గోవిందరాజుల కాలనీ, ఐలాపురం గ్రామాల్లో అంగన్వాడి సెంటర్లలో ‘అమ్మమాట అంగన్వాడి బాట’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిడిపిఓ ప్రేమలత మాట్లాడు తూ, ‘‘ఈరోజు నుంచి వారం రోజులపాటు తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నామని, రెండు, మూడు సంవత్సరాల వయసు దాటిన పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించి వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలి’’ అని తెలిపారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ పుష్పలత, ఆయా గ్రామాల అంగన్వాడీ టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.