రెవెన్యూ సదస్సులకు విశేష స్పందన
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలంలో ఈనెల మూడో తేదీన ప్రారంభమైన రెవెన్యూ సదస్సులకు విశేష స్పందన లభించింది. మండలంలోని 18 పంచాయతీలలో శనివారం నాటికి 9 గ్రామపంచాయతీలలో రెవెన్యూ సదస్సులు పూర్తయ్యాయి. శనివారం నాటికి ఆయా గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయా గ్రామాల ప్రజల నుండి 719 దరఖాస్తులు అందాయని, దరఖాస్తులలో ఎక్కువగా వారసత్వం, అసైన్మెంట్, సాదా బైనమా, భూమి సమస్యలు పై ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయని, మండల తాసిల్దార్ ఎం. వేణుగోపాల్ తెలిపారు. రెవెన్యూ సదస్సులను రెండు టీంలుగా నిర్వహిస్తున్నట్లు తాసిల్దార్ తెలిపారు. మండల పరిధిలో నూగురు గ్రామంలో సోమవారం నూగూరు (జి), మరియు నూగూరు (జెడ్)పాలెం (జి),(జడ్)లకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు