నాణ్యమైన విత్తనాలు, ఎరువులు,పురుగు మందులు అందుబాటులో ఉంచాలి

నాణ్యమైన విత్తనాలు, ఎరువులు,పురుగు మందులు అందుబాటులో ఉంచాలి

నాణ్యమైన విత్తనాలు, ఎరువులు,పురుగు మందులు అందుబాటులో ఉంచాలి

– విత్తనాలు అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు.

– జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.

ములుగు ప్రతినిధి, జూన్ 5, తెలంగాణ జ్యోతి :  ఖరీఫ్ సీజన్ లో రైతులు సాగు చేసేందుకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను సరిపోను విత్తన, ఎరువులు, పురుగు మందుల దుకాణాలలో అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.అన్నారు. గురువారం జిల్లా కేంద్రం లోని లక్ష్మి ఫర్టిలైజర్స్, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విత్తన, ఎరువులు, పురుగు మందుల నిల్వలు, విక్రయాలకు సంబంధించిన రికార్డులు, బిల్లు బుక్కులు, లైసెన్స్ ను కలెక్టర్ తనిఖీ చేశారు. గోదాములో నిల్వ చేసి ఉన్న విత్తనాలు, ఎరువులు, మందులను కలెక్టర్ పరిశీలించారు. ఈ-పాస్ మిషన్ వినియోగం గురించి విత్తన, ఎరువుల దుకాణా దారులను అడిగి తెలుసుకున్నారు. దుకాణాలలో విత్తన, ఎరువులు, పురుగు మందుల నిల్వలకు సంబంధించిన స్టాక్ బోర్డులను పరిశీలించారు. పత్తి విత్తన ప్యాకెట్లకు ఉన్న లేబుల్స్ ను పరిశీలించారు. అదేవిధంగా పత్తి విత్తనాలకు సంబంధించి ఎన్ని రకాలు నిల్వ ఉన్నాయి, ఏ రకం ఎక్కువగా విక్రయిస్తు న్నారనే వివరాలను దుకాణదారులను అడిగి తెలుసుకున్నారు. దుకాణంలో నిల్వల వివరాలను ప్రతిరోజు వ్యవసాయ శాఖ అధికారులకు అందించాలని సూచించారు. ఈ సందర్భంగా దుకాణంలో పత్తి విత్తనాలు కొనుగోలుకు వచ్చిన రైతును ఎన్ని సంవత్సరాల నుండి ఈ షాపులో విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు, విత్తనాల నాణ్యత ఏవిధంగా ఉంది, రసీదు ఇస్తున్నారా అని అడిగి తెలుసుకొన్నారు. విత్తన కొనుగోలు రసీదులు జాగ్రత్తగా పొందుపరచుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి పరమేశ్వర్, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment