జర్నలిస్టు కుటుంబానికి ఆర్థిక సాయం అందించడం అభినందనీయం
– జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్
ములుగు ప్రతినిధి, జూన్04, తెలంగాణ జ్యోతి : యూనియన్ల కు అతీతంగా ఇటీవల మృతి చెందిన నిరుపేద జర్నలిస్ట్ శంకర్ కుటుంబానికి ఆర్థిక సాయం సేకరించి ఇవ్వడం అభినంద నీయమని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ అన్నారు. ఇటీవల ములుగు జిల్లా కేంద్రంలో జర్నలిస్టుగా విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో మృతి చెందిన తోగరి శంకర్ కుటుంబానికి తోటి జర్నలిస్టులు చేసిన 25 వేల రూపాయల సాయాన్ని బుధవారం నాడు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది. తొగరి శంకర్ గుండెపోటుతో మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న వెంటనే వారి కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలంటూ వివిధ ప్రచార మాధ్యమాల్లో మీడియా గ్రూపుల్లో తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ ములుగు జిల్లా శాఖ ఆధ్వర్యంలో పడమటింటి నగేష్ … చల్ల గురుగుల రాజువర్ధన్ ఆధ్వర్యంలో యూనియన్లకు అతీతంగా 25 వేల రూపాయలు సేకరించడం జరిగింది.ఈ మొత్తాన్ని పోస్టల్ బాండ్ రూపంలో జర్నలిస్ట్ శంకర్ కుమార్తె సహస్రకు జిల్లా కలెక్టర్ అందజేశారు. ఇంత మంచి కార్యక్రమానికి ముందుండి విరాళాలను సేకరించిన పడమటింటి నగేష్ చల్లగురుగుల రాజువర్ధన్.. సంఘ రంజిత్ లను కలెక్టర్ అభినందించారు. తమ వంతు సహాయంగా శంకర్ కుటుంబా నికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వీలైనంత సాయం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. బాధితులు జయశంకర్ భూపాల పల్లి జిల్లాకు చెందినవారు కావడంతో అక్కడి అధికారులతో సంప్రదింపులు జరిపి సాయం అందిస్తామన్నారు ఈ కార్యక్రమం లో కలెక్టర్ తో పాటు అడిషనల్ కలెక్టర్ మహేందర్ జి.. తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ ములుగు జిల్లా గౌరవ అధ్యక్షుడు పడమటింటి నగేష్. జిల్లా అధ్యక్షుడు చల్లగురుగుల రాజువర్ధన్, జిల్లా ప్రధాన కార్యదర్శి సంఘ రంజిత్ , చల్లూరి మహేందర్ తదితరులు పాల్గొన్నారు.