ఉరివేసుకుని యువకుని ఆత్మహత్య
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలం బెస్తగూడెం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బేగ విజయ్ (25) ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విజయ్ ఒక ప్రైవేట్ ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అర్ధరాత్రి కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో దూళానికి ఉరివేసుకొన్నాడు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు వెంకటా పురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు కారణాలు తెలియ రాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గ్రామస్థులు, బంధుమిత్రులు వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకుని మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు.