గుడుంబా స్థావరాలపై వెంకటాపురం పోలీసులు దాడులు

గుడుంబా స్థావరాలపై వెంకటాపురం పోలీసులు దాడులు

గుడుంబా స్థావరాలపై వెంకటాపురం పోలీసులు దాడులు

– 2 వేల లీటర్ల బెల్లం పానకం ధ్వంసం. 

– 55 లీటర్ల గుడుంబా స్వాధీనం. 

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూగూరు అటవీ ప్రాంతంలో సోమవారం సాయంత్రం వెంకటాపురం పోలీసులు గుడుంబా స్థావరాలపై విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు 2 వేల లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. సుమారు 55 లీటర్ల గుడుంభా స్వాధీనం చేసుకొని ముగ్గురు దొంగసారా వ్యాపారులను అరెస్ట్ చేశారు. పోలీసుల దాడులను ముందే పసికట్టిన దొంగ సారా వ్యాపారులు అడవుల్లోకి పరార్ అయ్యారు. వెంకటాపురం పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ తిరుపతిరావు మాట్లాడుతూ సారా తయారు చేసిన, విక్రయించిన ప్రజలు సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దాడుల్లో వెంకటాపురం ఎస్ఐ తిరుపతి రావు, శిక్షణ ఎస్ఐలు అవినాష్, తిరుపతి రెడ్డి, సివిల్, మరియు సిఆర్పిఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment