అంగన్వాడీలకు శుభవార్త చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్, మే 31, తెలంగాణ జ్యోతి : అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారి పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులను శనివారం జారీ చేసింది. అలాగే అంగన్వాడీ టీచర్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు, హెల్పర్లకు రూ.50వేల నుంచి రూ.లక్షకు పెంచింది. 60 ఏళ్లు దాటి వి ఆర్ ఎస్ తీసుకునే టీచర్లు, హెల్పర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్తిస్తాయని పేర్కొంది. దీంతో 70వేల మందికి ప్రయోజనం కలగనుంది.