జనాల్లో కలవండి.. ప్రశాంతంగా జీవించండి…

జనాల్లో కలవండి.. ప్రశాంతంగా జీవించండి...

జనాల్లో కలవండి.. ప్రశాంతంగా జీవించండి…

– మావోయిస్టులకు ఎస్పి శబరిష్ పిలుపు

– 8మంది మిలిషియా సభ్యుల లొంగుబాటు

ములుగు ప్రతినిధి, మే 31, తెలంగాణ జ్యోతి : లొంగిపోయిన మావోయిస్టు మలేషియా సభ్యులకు జిల్లా ఎస్పీ డాక్టర్ చివరి శనివారం రివార్డులు అందజేశారు. జిల్లా పోలీసు కార్యాలయం లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎస్పీ మాట్లాడుతూ మావోల సిద్ధాంతాలు నచ్చక కొందరు అనారోగ్యం పాలై జనజీవన స్రవంతిలో కలిసేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు. జనజీవన స్రవంతిలో కలిసి ప్రజలతో సుఖంగా జీవించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘పోరు కన్నా ఊరు మిన్న మన ఊరికి తిరిగి రండి’ కార్యక్రమం లో భాగంగా 8 మంది మావోయిస్టులు లొంగిపోగా వారికి రూ.25 వేల రూపాయల చొప్పున రివార్డులను ఎస్పీ అంద జేశారు. లొంగిపోయిన వారిలో మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా జరవడ్డ గ్రామానికి చెందిన డివిజన్ కమిటీ సభ్యుడు దొర్పెట్టి మిర్గు అలియాస్ లింగ అలియాస్ శివలాల్, చత్తీస్గడ్ రాష్ట్రంకు చెందిన ఏరియా కమిటీ సభ్యులు మడవి టిడో, మీడియం బీమా, సభ్యులు ఉయిక అనిత, మడకం కమలేష్, సోయం భీమే, మడవి మడక, మదవి ఇడుమ ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఏటూరు నాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, డిఎస్పి రవీందర్, సీఐ శ్రీనివాస్, ఎస్సైలు తిరుపతిరావు, తాజుద్దీన్, సిబ్బంది ఉన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment