నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు

– పోలీసు, వ్యవసాయ శాఖ సంయుక్త తనిఖీలు

కాటారం, తెలంగాణ జ్యోతి : వ్యాపారస్తులు నకిలీ విత్తనాలు అమ్ముతే కఠిన చర్యలు తీసుకుంటామని తనిఖీలలో లభిస్తే పీడీ యాక్ట్ అమలు చేస్తామని కాటారం డిఎస్పి జి రామ్ మోహన్ రెడ్డి అన్నారు. ఖరీఫ్ సీజన్లో నకిలీ విత్తనాల అమ్మతే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో అధికారులు దుకాణాల తనిఖీకి శ్రీకారం చుట్టారు. భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ వ్యవసాయ శాఖ సబ్ డివిజన్లోని కా lటారం మండల కేంద్రంలో కాటారం డిఎస్పి జి రామ్మోహన్ రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ అభినవ్, వ్యవసాయ శాఖ అధికారి పూర్ణిమ ఆధ్వర్యంలో గారెపల్లి లోని ఎరువుల దుకాణాలను శుక్రవారం తనిఖీలు చేశారు. కాటారం మండల కేంద్రంలోని ఫర్టిలైజర్స్& పెస్టిసైడ్స్, సీడ్స్ దుకాణాలను పోలీస్, వ్యవసాయ శాఖల అధికారులు సంయుక్త తనిఖీలు నిర్వహించారు. కొందరు వ్యక్తులు గ్రామాలలో నెట్వర్క్ ఏర్పాటు చేసుకొని డిసెంబర్ నెల నుండి బి జి 3 పత్తి విత్తనాలు విక్రయిస్తున్నారని ఎరువుల వ్యాపారి సమ్మిరెడ్డి అధికారులకు వివరించారు. బిజీ టు విత్తనాలు విక్రయించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు మంజూరు చేశాయి. మాత్రమే కేంద్ర పత్తి విత్తనాల స్టాక్, రిజిస్టర్ లను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిం చారు. రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని బిజి 3 విత్తనాలు అధిక దిగుబడులు వస్తాయని పురుగుమందుల వాడకం తక్కువగా ఉంటుందని నమ్మబలుకుతూ కొందరు బడా రైతులను గ్రామాలలో ఏజెంట్లుగా పెట్టుకొని ఆ విత్తనాలను విక్రయిస్తున్నారని వ్యాపారస్తులు అధికారుల దృష్టికి తీసు కెళ్లారు. నకిలీ విత్తనాల విక్రయాలపై నిఘా ఉంచుతామని, తనిఖీలు చేసి పట్టుపడితే చర్యలు తీసుకుంటామని డిఎస్పి రామ్మోహన్ రెడ్డి హెచ్చరించారు. కాటారం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని మండలాల్లో ఎరువుల దుకాణాల వ్యాపారస్తులు ఎరువులు బ్లాక్ మార్కెట్లో విక్రయించరాదని నకిలీ విత్తనాలు అమ్మవద్దని ప్రభుత్వం నిషేధించిన పురుగుమందులను విక్ర యిస్తే తగిన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ తెలిపారు. దుకాణాలలో ఉన్న నిల్వలు రిజిస్టర్లలో నమోదు వివరాలను తనిఖీ చేసినట్టు తెలిపారు.

మిల్లులలో ధాన్యం తక్కువ ధరకు ఖరీదు చేస్తే చర్యలు : డీఎస్పీ

కాటారం, మలహర్ మండలాల్లోని అంకుసాపూర్, కొండంపేట గ్రామాలలోని రైస్ మిల్ లను, ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం కాటారం డిఎస్పి తనిఖీలు చేశారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే వడ్లు తక్కువ ధరకు కొనుగోలు చేయవద్దని రైతులను మోసగించవద్దని డిఎస్పి మిల్లర్లకు సూచించారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment