జంగాలపల్లి మినీ గురుకులంలో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

జంగాలపల్లి మినీ గురుకులంలో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

వెంకటాపురం నూగూరు, తెలంగాణజ్యోతి : ములుగు జిల్లా  వాజేడు వాజేడు మండలం జంగాలపల్లి మినీ గురుకుల పాఠశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్ జే. సుజాత వెల్లడించారు. ఈ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడంతో పాటు, ఆధునిక విద్యా ప్రమాణాలతో విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసే సంస్థగా గుర్తింపు పొందిందన్నారు. ప్రవేశాల కోసం దరఖాస్తుల స్వీకరణ 2025 మే 30వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ వరకు జరగనుందని తెలిపారు. ఖాళీల వివరాలు : 1వ తరగతి – 30 సీట్లు, 2వ తరగతి – 15 సీట్లు, 4వ తరగతి – 1 సీట్లలో అర్హత గల విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. దరఖాస్తు తో పాటు రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, విద్యార్థి ఆధార్ కార్డు జిరాక్స్, తల్లిదండ్రుల ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఫోన్ నంబర్ తదితర అవసరమైన పత్రాలను జతపరచాలని ప్రిన్సిపాల్ సూచించారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment