డీడబ్ల్యూవో బాధ్యతల నుంచి జిల్లా అధికారిణి శిరీష తొలగింపు

డీడబ్ల్యూవో బాధ్యతల నుంచి జిల్లా అధికారిణి శిరీష తొలగింపు

డీడబ్ల్యూవో బాధ్యతల నుంచి జిల్లా అధికారిణి శిరీష తొలగింపు

– తాత్కాళిక ఆఫీసర్ గా తుల రవి

– చర్యలు తీసుకున్న కలెక్టర్ దివాకర

ములుగు ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా సంక్షేమాధికారిణి కె.శిరీష ను తన బాధ్యతల నుంచి తప్పిస్తూ కలెక్టర్ దివాకర టీఎస్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ములుగు సీడీపీవో గా ఉన్న కె.శిరీష జిల్లా సంక్షేమ అధికారిణిగా పనిచేస్తున్నారు. అయితే ములుగులోని బాలకల చిల్ట్రన్స్ హోం నుంచి ఈనెల 26న బాలిక తప్పిపోయినందుకు గాను విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆమెను ఫుల్ అడిషనల్ చార్జ్ నుంచి తప్పిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. సంఘటన జరిగినా ఉన్నతాధి కారులకు నివేదిక ఇవ్వడంలో విఫలమవడం, పిల్లల భద్రత, సంక్షేమానికి ముప్పు కలిగించిందని, తద్వారా సంస్థను నిర్వహిం చడంలో పూర్తి బాధ్యతను నిర్వర్తించకుండా బాధ్యతలను ఉల్లంఘించారని వెల్లడించారు. అందుకు గాను డీడబ్ల్యూవో బాధ్యత నుంచి తొలగిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఎస్సీ కార్పోరేషన్ ఈడీ తుల రవి జిల్లా సంక్షేమాధికారి బాధ్యతలో కొనసాగుతారని కలెక్టర్ తెలిపారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment