ఈ పాస్ మిషన్ల ద్వారానే ఎరువులను విక్రయించాలి

ఈ పాస్ మిషన్ల ద్వారానే ఎరువులను విక్రయించాలి

కాటారం, తెలంగాణజ్యోతి : జిల్లాలో ఎరువుల వ్యాపారస్తులు ఈ పాస్ మిషన్ల ద్వారానే ఎరువులను విక్రయించాలని భూపాలపల్లి జిల్లా టెక్నికల్ ఏడిఏ బాబురావు తెలిపారు. ఈపాస్ మిషన్లో న్యూ సాఫ్ట్వేర్ అప్డేటెడ్ కార్యక్రమాన్ని గురువారం మండలం కాటారం రైతు వేదిక కార్యాలయంలో ప్రారంభించారు. వ్యవసాయ శాఖ డివిజన్లోని కాటారం, మహాదేవపూర్, మహాముత్తారం, మలహర్రావు, పలిమెల, మండలాలకు చెందిన ఎరువుల డీలర్లతో సమావేశం నిర్వహించారు. చెరువుల విక్రయాలను ఆధార్ బయోమెట్రిక్ అనుసంధానంగా అప్డేటెడ్ న్యూ వెర్షన్ సాఫ్ట్వేర్ను డీలర్లు అప్డేట్ చేసుకోవాలని సూచించారు. పాతం ఈ పాస్ మిషన్లు కలిగిన డీలర్లకు కొత్త మిషన్లు సంబంధిత కంపెనీలు ఇస్తున్నట్లు ఏ డి ఏ బాబురావు తెలిపారు జిల్లాలో 335 మంది ఎరువుల వ్యాపారస్తులకు 315 మంది ఈ పాస్ మిషన్లు కలిగి ఉన్నార న్నారు. మొబైల్ ద్వారా సాఫ్ట్వేర్ చేస్తున్న డీలర్లకు కొత్త మిషన్లు ఇస్తామన్నారు భూపాలపల్లి వ్యవసాయ శాఖ డివిజన్లో బుధవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా శుక్రవారం వరకు డీలర్లందరూ తప్పకుండా సాఫ్ట్వేర్ను అప్డేట్ చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా సూపరిండెంట్ శ్రీనివాస్, మహదేవపూర్ ఏడిఏ శ్రీపాల్, కాటారం ఏఓ పూర్ణిమ, మహా ముత్తారం ఏ ఓ అనూష, మహాదేవపూర్ ఏవో సుప్రజ్యోతి, ఆర్ సిఎఫ్ ప్రతినిధులు, ఏ ఈ ఓ లు రాజన్న, అస్మా, కాటారం మండల ఎరువుల అసోసియేషన్ అధ్యక్షులు కవ్వాలశేఖర్, ప్రధాన కార్యదర్శి జక్కు ఐలయ్య,కోశాధికారి బచ్చు ప్రభాకర్, ఉపాధ్యక్షుడు అల్లాడి చంద్రమౌళి,దోమ భాస్కర్, మలహార్ మండల శాఖ అధ్యక్షులు సాగర్ రావు, కోశాధికారి అల్లాడి సురేష్, మహాముత్తారం మండల అసోసియేషన్ అధ్యక్షుడు గట్టు సమ్మయ్య, వివిధ గ్రామాలకు చెందిన ఎరువుల దుకాణ దారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment