పుష్కర స్నానానికి వచ్చి పిచ్చిపట్టినట్లు ప్రవర్తించిన కమాన్ పూర్ మాజీ జడ్పిటిసి పుట్ట మధుకర్
కాటారంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకుల విమర్శలు
కాటారం, తెలంగాణ జ్యోతి : సరస్వతి పుష్కరాల నిర్వహణ లో రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూసి ఓర్చుకోలేక కమాన్ పూర్ మాజీ జడ్పిటిసి పుట్ట మధుకర్ ప్రెస్టేషన్లో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని శుక్రవారం కాటారంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి సారి జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మంథని నియోజకవర్గం, మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సరాస్వతి పుష్కరాలను రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దగ్గరుండి అన్నీ తానై భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ జిల్లా యంత్రాంగంతో ప్రణాళికలు రూపొందిస్తూ భక్తులచే మన్ననలు పొందడం ప్రజలలో వస్తున్న ఆదరణ చూసి పుట్ట మధుకర్ ఓర్వలేక పోతున్నాడని విమర్శించారు. నిన్న కాళేశ్వరం పుష్కర స్నానానికి వచ్చిన కమాన్ పూర్ మాజీ జడ్పిటిసి సభ్యుడు,అక్కడ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పుష్కర ఘాట్లు చలువ పందిళ్లు, ఘాట్లకు వెళ్లే రోడ్లు,టెంట్ సిటీ, పారిశుద్యం, మెడికల్ సౌకర్యాలు,పుష్కర ఘాట్ల వరకు ఉచిత బస్ సౌకర్యం, వేరు వేరుగా పార్కింగ్ ఏర్పాట్లు,పోలీస్ రక్షణలో ఎంతో ఘనంగా,పటిష్టంగా నిర్వహి స్తుంటే పుష్కరాల కోసం కాళేశ్వరానికి లక్షలాదిగా తరలి వస్తున్న భక్తులను చూసి పిచ్చెక్కిపోయిన డూప్ బహుజన వాది పుట్ట మధుకర్ అని ఆరోపించారు. అక్కడ ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా కనబడగానే కాలేశ్వరంలో సౌకర్యాలను చూసి రాను రాను మంథని నియోజకవర్గంలో నాకు రాజకీయ భవిష్యత్ ఉండదేమో అనుకుని..ఈ సరాస్వతి పుష్కరాలు ఇంత ఘనంగా నిర్వహిస్తే మళ్ళీ ప్రస్తుత రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కి మంథని నియోజకవర్గ ప్రజలు మళ్ళీ ఒక ఐదు పర్యాయాలు మంథని ఎమ్మెల్యే గా అవకాశం ఇస్తారేమే,నా పరిస్థితి ఏంటి అనే అభద్రతా భావంతో,మొన్న ఓడిపోయిన ప్రేస్టేషన్ లో మీడియా కనబడగానే పిచ్చిలేచిన వ్యక్తిగా ప్రవర్తి స్తూ మాట్లాడినట్లు కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా విమర్శించారు. ఆ ప్రేస్టేషన్ లో ఒక సీనియర్ మహిళ ఐఎఎస్ అధికారి దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని మహిళ అని చూడకుండా విచక్షణ కోల్పోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడినట్లు విషయమై నియోజకవర్గంలోని మహిళలందరూ మాజీ జెడ్పిటిసిని నిలదీ యాలని ఎక్కడికక్కడే కేసులు పెట్టాలని పిలుపునిచ్చారు.
డూప్ బహుజనవాది కమాన్ పూర్ మాజీ జడ్పిటిసి సభ్యుని అదృష్టం..ఎందుకంటే..!
సరాస్వతి పుష్కరాలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన కాశీలో ఇచ్చే గంగా హారతి ఇచ్చే పండితులను కాశీ నుండి తీసుకు వచ్చి మొదటి సారి తెలంగాణ రాష్ట్రంలో అది మన కాళేశ్వరం లో సరాస్వతి నది హారతి నిర్వహిస్తున్నారు. సరస్వతి నది హారతిని కమాన్ పూర్ మాజీ జడ్పిటిసి సభ్యుడు చూడలేదు. నది హారతి చూస్తే బట్టలు చింపుకును కావొచ్చు అతన్ని నిన్న బట్టలు చింపుకోకుండా వర్షం కాపాడిందనే చెప్పవచ్చునని తీవ్రంగా విమర్శించారు. 2014 లో బహుజన వాదం ముసుగు లో టిఆర్ఎస్ (దొరల) పార్టీ నుండి డూప్ బహుజనవాది మంథని ఎమ్మెల్యేగా అయిన తర్వాత మంథని నియోజక వర్గంలో వివిధ కారణాలతో ప్రత్యేక్షంగా మీ పార్టీ నాయకులు పరోక్షంగా మీరు నలుగురు దళితులను హత్య చేశారని ఆరోపించారు. జాడి కవిరాజు, మహముత్తరం, మంథన మధుకర్, కానాపూర్, శీలం రంగయ్య, రంగయ్యపల్లి, రెవెళ్లి రాజబాబు, మల్లారం ఆయా మ్రుతుల కుటుంభ సభ్యులకు ఎన్ని లక్షల ఎక్సగ్రెసియా ఇచ్చావో కమాన్ పూర్ మాజీ జడ్పిటిసి సభ్యుడు డూప్ బహుజనవాది సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. భారతదేశంలో అత్యున్నత సర్వీస్ ఐ ఏ ఎస్,అలాంటి ఒక సీనియర్ మహిళ ఐ ఏ ఎస్ అధికారిణి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కమాన్ పూర్ మాజీ జడ్పిటిసి పుట్ట మధుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. మహిళ ఐ ఏ ఎస్ అధికారి పై అనుచిత వాఖ్యలు చేసినదానికి మంథని నియోజకవర్గం లోని మహిలంతా తీవ్రంగా ఖండించాలని కోరారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు దండు రమేష్, కోట రాజబాబు, వేమునూరు ప్రభాకర్ రెడ్డి, పంతకాని సమ్మయ్య, చీర్ల తిరుపతిరెడ్డి,చీమల సందీప్, విలాస్ రావు, భూపెళ్లి రాజు, ఓన్న వంశవర్ధన్ రావు, గద్దె అన్ని రెడ్డి కుంభం రమేష్ రెడ్డి, కడారి విక్రమ్,చీటూరి మహేష్, నాయిని శ్రీనివాస్,బొప్పారంకు చెందిన రమేష్, దోమల సమ్మయ్య, ఆత్మకూరి కుమార్ యాదవ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.