5వ బెటాలియన్ ను సందర్శించిన ట్రైనీ ఐపీఎస్ లు
ములుగు ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : గోవిందరావుపేట మండలం చల్వాయిలోని తెలంగాణ 5వ పోలీస్ బెటాలియన్ ను మంగళవారం ట్రెయినీ ఐపీఎస్ లు సందర్శించారు. బెటాలి యన్ అంతా కలియ దిరిగి పరిశీలించిన ట్రెయినీ ఐపీఎస్ లు మన్నన్ భట్, రుత్విక్ సాయి, సాయికిరణ్, వసుంధరలు ఇంచార్జి కమాండెంట్ కె.సుబ్రహ్మణ్యంతో కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బెటాలియన్ వ్యవస్థ, పనితీరు, చేపడుతున్న పనులపై వారికి కమాండెంట్ క్లుప్తంగా వివరించారు. అనంతరం బెటాలియన్ కు సంబంధించిన పస్రా అవుట్ పోస్టును సందర్శిం చిన వారు విధులు, పని తీరును తెలుసుకున్నారు. శాఖా పరమైన విషయాల గురించి అధికారుల తో చర్చించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ అనిల్ కుమార్, ఆర్ ఐ లు శోభన్ బాబు, కార్తీక్, సాల్మన్ రాజ్, రాంప్రసాద్, అన్నయ్య మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.