క్రిందకి వేలాడుతున్న విద్యుత్ తీగలు
– పట్టించుకోని విద్యుత్ శాఖ అధికారులు
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రం, వాజేడు రోడ్ శ్రీ కనక దుర్గమ్మ గుడికి సమీపంలో విద్యుత్ తీగలు క్రిందకు వంగి ప్రమాద భరితంగా తయారయ్యాయి. రాష్ట్రీయ రహదారి నెంబర్ 12 నుండి భద్రాచలం, చర్ల, రహదారి నుండి వెంకటాపురంకు రాత్రి పగలు నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటా యి. వందల సంఖ్యలో ఇసుక లారీలతో పాటు, మిర్చిలోడు లారీలు, ఇతర వాహనాలు, విద్యుత్ తీగలు క్రిందకు ఉండడం తో లారీ డ్రైవర్లు తీగల వద్ద స్లో చేసుకుని వెదురు కర్రలతో తీగలు పైకి లేపి రాక పోకలు సాగిస్తున్నారు. విద్యుత్ తీగలు రాపిడి జరిగి నిప్పురవ్వలు సైతం పడుతున్నాయని విద్యుత్ శాఖ అధికారులకు ప్రజలు, వాహనదారులు, పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవటం లేదని అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో విశేషం ఏమంటే నేలకు వంగిన తీగలు వెంకటాపురం విద్యుత్ సబ్ స్టేషన్ కు కేవలం 50 మీటర్ల దూరంలోనే ఉన్నాయి.