ట్రాఫిక్ సిబ్బందికి చలువ కళ్లద్దాలు అందించిన ఎస్పీ కిరణ్ ఖరే 

ట్రాఫిక్ సిబ్బందికి చలువ కళ్లద్దాలు అందించిన ఎస్పీ కిరణ్ ఖరే 

కాటారం, తెలంగాణ జ్యోతి : భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీసు స్టేషన్ సిబ్బందికి మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కిరణ్ ఖరే చలువ కళ్లద్దాలు అందించారు. ఎండ తీవ్రతను ఎక్కువగా ఉండటంతో సిబ్బందికి కంటికి చల్లధనన్నాన్నీ ఇచ్చే కంటి అద్దాలను ఎస్పీ ప్రత్యేక చొరవతో తెప్పించి, సిబ్బందికి ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అతినీల లోహిత కిరణాల వలన జబ్బులు వచ్చి అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉన్నందున, కంటి అద్దాలను సిబ్బంది అందజేశామని, సిబ్బంది తప్పక దరించి, సద్వీనియో గం చేసుకోవాలని కోరారు. చలువ కళ్ళద్దాల వలన దుమ్ము, ధూళితో కంటికి ఎలాంటి ప్రమాదం కలుగదని అన్నారు. అలాగే సిబ్బంది తగినంత మంచినీరు తాగాలని, ట్రాఫిక్ సిబ్బంది, అధికారులు,ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని, సమర్థవం తంగా విధులు నిర్వహించాలని, సిబ్బందికి ఎలాంటి అవసరా లు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని ఎస్పీ కిరణ్ ఖరే పేర్కొ న్నారు. ఈ కార్యాక్రమంలో భూపాలపల్లి, డిఎస్పీ ఎ.సంపత్ రావు, భూపాలపల్లి సిఐ నరేష్ కుమార్, ట్రాఫిక్ ఎస్ ఐ శ్రీనివాస్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment