ప్రజలను ఆదుకున్నది, సాదుకున్నది కేసీఆరే.
- రొయ్యూరు ఎన్నికల ప్రచారంలో బడే నాగజ్యోతి
ములుగు ప్రతినిధి : దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలను ఆదుకున్నది, సాదుకున్నది ముఖ్యమంత్రి కేసీఆరే నని ములుగు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి అన్నారు. గురువారం ఏటూరునాగారం మండలం రొయ్యూరులో బడే నాగజ్యోతి ప్రచారం నిర్వహించారు. రొయ్యూరులో బతుకమ్మలు మంగళ హారతులతో పార్టీ శ్రేణులు, గ్రామ ప్రజలు సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చిన ఘనత కేసీఆర్ దేని అన్నారు. దాంతోపాటు గిరిజనే తరులకు కూడా పోడు పట్టాలు ఇస్తామని బీ ఆర్ ఎస్ మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగిందని ఆమె గుర్తు చేశారు. గత 60 ఏళ్లుగా ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోని కాంగ్రెస్ ను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి రాగానే ఇంటింటికి ప్రతి మహిళకు 3 వేల రూపాయల జీవనభృతిని ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రజలు ఒకసారి అవకాశం కల్పించాలని అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు.జిల్లా పార్టీ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణరావు మాట్లాడుతూ 93 లక్షల తెల్ల రేషన్ కార్డు కలిగిన రైతులకు భూమి ఉన్నా లేకున్నా ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమా కల్పిస్తున్నట్లు వెల్లడించారు త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన ఆడబిడ్డ బడే నాగజ్యోతిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో రొయ్యూరు గ్రామ అధ్యక్షులు రాంబాబు, సర్పంచ్ శకుంతల ముకుందరావు, ఎంపీటీసీ జాడి లక్ష్మి నారాయణ, మండల అధ్యక్షులు గడదాసు సునీల్ కుమార్, పార్టీ సీనియర్ నేతలు కూ నూరు మహేష్, వాలియా బి తదితరులు పాల్గొన్నారు.