బాకీ రికవరీ కోసం ఎండు మిర్చి బస్తాలు ఎత్తుకెళ్లిన పెర్టి లైజర్స్ షాప్ యజమాని
– మనస్థాపంతో పురుగుమందు తాగి రైతు ఆత్మహత్యాయత్నం
వెంకటాపురం నూగూరు, తెలంగాణా జ్యోతి : ఆరుగాలం కష్టపడి పండించిన పంటను వడ్డీ వ్యాపారి, ఫెర్టిలైజర్స్ షాప్ యజమాని మిర్చి బస్తాలను తన తోట వద్ద కు వచ్చి బాకీ రికవరీ కోసం ప్యాకింగ్ చేసిన ఎండిమిర్చి బస్తాలను దౌర్జన్యంగా ట్రాక్టర్లో వేసుకొని పట్టి కెళ్ళిపోవడంతో, మనస్థాపానికి గురైన రైతు పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ములుగు జిల్లా వాజేడు మండలం ధర్మారం ప్రాంతంలో జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం… ధర్మారం గ్రామానికి చెందిన బొగట నరసింహారావు అనే రైతు రెండు ఎకరాలు మిర్చి తోట సాగు చేశారు. అదే గ్రామానికి చెందిన ఎరువులు, పురుగు మందుల యజమాని పెట్టుబడి పెట్టాడు. వాతావరణ పరిస్థితులు, చీడపీడలు, నకిలీ మందులు, కారణంగా పంట దిగుబడి తగ్గి పోఇందీ. ఉన్న కొద్దిపాటి ఎండు మిర్చిని బస్తాలలో ప్యాకింగ్ చేసి మార్కెట్ కి తరలిస్తున్న సమయంలో, వడ్డీ వ్యాపారి తన తోట వద్దకు వచ్చి,బాకి రికవరి నిమిత్తం వ్యపారి బొల్లె ప్రశాంత్ ప్యాకింగ్ చేసిన ఎండు మిర్చి బస్తాలను బాకీ రికవరీ నిమిత్తం ట్రాక్టర్లో బలవంతంగా లోడు చేసుకుని పట్టుకెళ్ళిపోయాడు. ఊర్లో బాకీలు ఉన్నాయని, బాకీని దశల వారీగా చెల్లిస్తానని, కాళ్లా, ఏళ్లా పట్టుకున్న వడ్డీ వ్యాపారి, ఎరువులు పురుగు మందులు వ్యాపారి ప్రశాంత్ దౌర్జన్యంగా మిర్చి బస్తాలు పట్టుకెళ్ళిపోయాడు. దీంతో తీవ్రమైన మనస్థాపానికి గురైన రైతు బొగట నరసింహారావు పురుగుమందు సేవించాడు. వెంటనె సమీపంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా ప్రాథమిక చికిత్స అనంతరం, మెరుగైన వైద్యం కోసం ఎటురునాగారం ప్రభుత్వ వైద్యశాలకు తరలిం చారు. కాగ ఇటీవల వెంకటాపురం, వాజేడు మండలాల్లో బహుళజాతి నకిలీ మొక్కజొన్న విత్తనాల కారణంగా పంట నష్టపోయి ఇరువురు మొక్కజొన్న రైతులు ఆత్మహత్య చేసుకోగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ యంత్రాంగం రైతుల ఆందోళనలతో దిగి వచ్చింది. స్వగ్రామమైన వెంకటాపురం మండలం చిరుత పల్లి కి తరలివచ్చింది. జాతీయ ఎస్టీ కమిషన్ ఢిల్లీ సభ్యులు కూడా చిరుతపల్లి గ్రామానికి తరలి వచ్చారు. ఈ సంఘటన జరిగి పది రోజులు గడవక ముందే మరో రైతు, దళారీ దోపిడీకి మనస్థాపం చెంది పురుగు మందు తాగటం సంచలనం సృష్టించింది. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో రైతు ఆత్మహత్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇది మరవక ముందే మరో దళారి, వడ్డీ వ్యాపారి ఎరువులు పురుగు మందులు డీలర్ రైతుల వద్ద బాకీల రికవరి కోసం పంటను రికవరీ చేసుకోవడం రైతుని దౌర్జన్యంగా అవమానపరచడం, రైతు ఆత్మహత్య యత్నం చేసుకోవడం, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వెంకటాపురం పోలీస్ సర్కిల్ పరిధిలోని, ధర్మారం గ్రామం, ఏఎస్పీ ఐపీఎస్ ఎటురు నాగారానికి 30 కిలోమీటర్లు, ధర్మారం నుండి కిలో మీటర్ దూరంలో పేరూరు పోలీస్ స్టేషన్ , ములుగు జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్లు దూరంలో,కలెక్టర్ , ఎస్.పి. ఉన్న, ప్రభుత్వ యంత్రాంగం రైతుల పక్షాన కదలి రాకపోవటం పట్ల, రైతు సంఘాలు, గిరిజన సంఘాలు, ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ మేరకు ములుగు జిల్లా కలెక్టర్, ములుగు జిల్లా ఎస్పీ, వ్యవసాయ శాఖ అధికారులు రైతు ఆత్మహత్యాయత్నంపై మీడియా వార్తలు పై ఆరా తీస్తున్నట్లు సమాచారం.