బస్ స్టేషన్ షాపింగ్ కాంప్లెక్స్ అద్దెలు చెల్లించవలసిందే.

Written by telangana jyothi

Published on:

బస్ స్టేషన్ షాపింగ్ కాంప్లెక్స్ అద్దెలు చెల్లించవలసిందే.

  •  భద్రాచలం డిపో మేనేజర్ వి. రామారావు 

వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా మండల కేంద్రమైన వెంకటాపురంలోని టీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్ ఆధ్వర్యంలోని షాపీంగ్ కాంప్లెక్స్ దుకాణాల యజమానులు ఆర్టీసీకి నెలవారి అద్దెలు చెల్లించవలసిందేనని భద్రాచలం డిపో మేనేజర్ వి. రామారావు అన్నారు. బుధవారం ఖమ్మం రీజినల్ మేనేజర్ ఆదేశంపై ఆర్టీసీ అధికారులు షాపింగ్ కాంప్లెక్స్ దుకాణదారులు అద్దె చెల్లింపు వివాదంపై వ్యాపారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డిఎం బస్ స్టేషన్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి బస్ స్టేషన్, షాపింగ్ కాంప్లెక్స్ ఇతర వివాదాలపై మీడియా సమావేశంలో వివరించారు. 1985 సంవత్సరం ఏపీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో వెంకటాపురం దేవదాయ శాఖ నుండి రెండు ఎకరాల 30 సెంట్లు స్థలాన్ని కొనుగోలు చేసి ప్రభుత్వ పరంగా ఆర్టీసీ డబ్బులు చెల్లించిందని తెలిపారు. సంబంధిత పత్రాలు ఆర్టీసీ వద్ద ఉన్నాయని తెలిపారు. ఇటీవల కాలంలో బస్ స్టేషన్ ఆవరణపై స్టేటస్ కో కోర్టు ఉత్తర్వులు వచ్చాయన్నారు. అయితే బస్ స్టేషన్ షాపింగ్ కాంప్లెక్స్ పై ఎటువంటి కోర్టు వివాదం లేదని, అయినా కానీ దేవస్థానం చెందిన కొంతమంది వ్యక్తులు, షాపులు వారిని అద్దెలు మాకే చెల్లించాలంటూ, భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. వెంకటాపురం నడి బొడ్డున విలువైన స్థలం ఆర్టీసీకి ప్రజల సహకారంతో కేటాయించడం జరిగిందన్నారు. ఆర్టీసీ బస్ స్టేషన్ ఆర్టిసి ప్రజల ఆస్తి అని ప్రజా సౌకర్యం కోసం ఏర్పాటు చేసిందని తెలిపారు. బస్ స్టేషన్ లోని 24 కు పైగా షాపింగ్ కాంప్లెక్స్ లు , ఆయా వ్యాపారులు వ్యాపారాలు నిర్వహించుకుంటు న్నారు అని ఢి.ఎం. తెలిపారు. ప్రజల ఆస్తి అయిన ఆర్టీసీ బస్ స్టేషన్ ఆవరణ ప్రజా సహకారంతో ప్రజలకు సౌకర్యం అందించేందుకు ఆర్టీసీ కృషి చేస్తుందని తెలిపారు. షాపింగ్ కాంప్లెక్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని తిరిగి ప్రజలకే ప్రయాణికుల సౌకర్యార్థం రవాణా సంస్థ ఖర్చు చేస్తుందని తెలిపారు. ఆర్టీసీకి ఆదాయం రాకుండా కోర్టు పేరుతో షాపింగ్ కాంప్లెక్స్ దుకాణదారులను అద్దెలు చెల్లించవద్దంటూ బెదిరింపులు ఎంతవరకు సమంజసమని ఆయన అన్నారు. ఆర్టీసీ నియమ నిబంధనల ప్రకారం తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగు తుందని తెలిపారు. ఆర్టీసీ బస్ స్టేషన్ 1985 నుండి రెండెకరాల 30 సెంటు స్థలం పత్రాల ఆధారంతో ఉన్నతాధికారులతో పాటు వెంకటాపురం పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశామని , ప్రజల ఆస్తిని ప్రజా సహకారంతో కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పయానికులు పై ప్రజలపై ఉందని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో భద్రాచలం డిపో మేనేజర్ రామారావు తో పాటు ఖమ్మం పిఓ రామ్మోహన్రావు, అకౌంట్ ఆఫీసర్ బాలస్వామి, ఆర్టీసి అధికారులు దామోదర్ రెడ్డి, భద్రాచలం బస్ స్టేషన్ మేనేజర్ అల్లం నాగేశ్వరరావు వెంకటాపురం కంట్రోలర్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now