భద్రాచలం నియోజకవర్గంలో గులాబీ జెండా రెపరెపలాడాలి.
- కార్యకర్తలు సంక్షేమ పథకాల లబ్ధిదారులను చైతన్య పరచాలి.
- బిఆర్ఎస్ ఎన్నికల కన్వీనర్ బుచ్చయ్య
వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిధి : భద్రాచలం నియోజకవర్గం లో గులాబీ జెండా రెపరెపలాడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి కుటుంభంలో లబ్దిదారులు స్వీకరిస్తున్నారని, ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం నియోజకవర్గంలో బి ఆర్ఎస్ పార్టీ విజయం సాధించే దిశగా, ప్రతి కార్యకర్త సైనికుడుగా పని చేయాలని బిఆర్ఎస్ పార్టీ వెంకటాపురం, వాజేడు మండలాల కన్వీనర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, సీనియర్ నాయకులు బోదె బోయిన బుచ్చయ్య పిలుపునిచ్చారు. మంగళవారం ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలంలో ఆయన పార్టీ నాయకులతో, కార్యకర్తలతో పార్టీ ప్రజా ప్రతినిధులతో,ఎన్నికల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రచార సమర రంగంలో పాల్గొనాలని, గులాబీ సైన్యంగా గ్రామాల్లో ప్రచార కార్యక్రమం నిర్వహించి, మన భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకటరావు ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పార్టీ అనుబంధ సంఘాలు పార్టీ ప్రజాప్రతినిధులతో సమన్వయ పరిచి విజయం సాధించే దిశగా ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిగా పని చేయాలని కోరారు. ఈ సందర్భంగా వాజేడు మండలం ఏడిచర్ల పల్లి పంచాయతీ ముత్తారం గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన అనేక మంది టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎన్నికల ప్రచార కన్వీనర్ బి. బుచ్చయ్య సమక్షంలో పార్టీలో చేరారు. వారందర్నీ సాదరంగా గులాబీ కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నేతలు పి. కృష్ణారెడ్డి, జడ్పిటిసి టి. పుష్పలత, మోహన్ రావు, చెన్నం ఎల్లయ్య, సాంబమూర్తి, ఇక పలువురు నేతలు పాల్గొన్నారు. అనంతరం వెంకటాపురం మండలంలోఊ ఎన్నికల కన్వీనర్ బి. బుచ్చయ్య సీనియర్ నాయకులను మండల కమిటీ నాయకులను, అనుబంధ సంఘాల నాయకులతో ఎన్నికల ప్రచార సమన్వయ సీనియర్ నేత లక్షీనారాయణ స్వగ్రుహం లో సమావేశం ఏర్పాటు చేసి ప్రచార సమన్వయ కార్యక్రమంలో పాల్గొని, అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకటరావు ను గెలిపించుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ కు, భద్రాచలం రాములవారికి కానుకగా సమర్ఫింద్ద మని పార్టీ నేతలు కార్యకర్తలు మధ్య ప్రకటించారు. కలిసికట్టుగా కృషి చేసి గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. బిఆర్ఎస్ పార్టీని అభ్యర్థిని గెలిపించుకొని భద్రాచలం నియోజకవర్గం ను అన్ని రంగాల్లో అభివృద్ధి పరచుకోవాల్సిన బాధ్యత మనందరి పై ఉన్నదని ఈ అవకాశాన్ని కలిసికట్టుగా, సంక్షేమ పథకాలు అమలులో ముందంజలో ఉన్న పార్టీ ప్రభుత్వం పథకాలతో ఒట్ల రూపంలో మలుచుకొని, విజయం సాధించే దిశగా కృషి చేయాలని ఎన్నికల కన్వీనర్ బుచ్చయ్య కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వేల్పూర్ లక్ష్మీనారాయణ, మండల అధ్యక్షులు గంపా రాంబాబు, కార్యదర్శి పిల్లర్ సెట్టి మురళి, అధికార ప్రతినిధి ధర్ర దామోదర్, శివాజీ, గొర్ల శ్రీను, గుమ్మెళ్ళ పురుషోత్తం, ఇంకా పలువురు నాయకులు, కార్యకర్తలు సమన్వయ సమావేశంలో పాల్గొన్నారు.
1 thought on “భద్రాచలం నియోజకవర్గంలో గులాబీ జెండా రెపరెపలాడాలి. ”