బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం
ఏటూరునాగారం ప్రతినిధి : మంగపేట మండలం బోర్ నర్సాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు రావుల రమణ, క్లస్టర్ ఇంచార్జ్ నర్రా శ్రీధర్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమనీకి మంగపేట మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ పాల్గొని మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చేసిన అభివృద్ధి వివరిస్తూ సీఎం కేసీఆర్ విడుదల చేసిన మేనిఫెస్టో గురించి ప్రజలకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి బడే నాగజ్యోతిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సభ్యులు పాల్గొన్నారు.
1 thought on “బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం”