అదుపు తప్పి కారు బోల్తా
తాడ్వాయి, ఫిబ్రవరి 15, తెలంగాణ జ్యోతి : మండలంలోని గంగారం బంజారా ఎల్లాపూర్ గ్రామాల మధ్య అదుపుతప్పి కారు బోల్తా పడిన సంఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం… భూపాలపల్లి నుంచి మణుగూరు వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడిందని తెలిపారు. అయితే కారులో ఐదుగురు ప్రయాణికులు ప్రయాణిస్తుండగా వారెవరికి పెద్ద ప్రమాదం జరగలేదని అన్నారు. స్వల్ప గాయాలైన వారిని మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించినట్లు వారు తెలిపారు.