ఏజెన్సీలో స్పెషల్ డిఎస్సిని వెంటనే నిర్వహించాలి.

Written by telangana jyothi

Published on:

ఏజెన్సీలో స్పెషల్ డిఎస్సిని వెంటనే నిర్వహించాలి.

  • రాజకీయ పార్టీల మేనిఫెస్టోలో ఆదివాసులు నిరుద్యోగుల కోసం ప్రత్యేకంగా పొందుపరచాలి.

వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిది : ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో సోమవారం గొండ్వానా సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా అధ్యక్షులు రేగ గణేష్ అధ్యక్షతన,గోండ్వానా విద్యార్థి సంక్షేమ పరిషత్ రాష్ట్ర కన్వీనర్ ఇర్ప. ప్రకాష్ అధ్యక్షతన జరిగింది. ఆయన మాట్లాడుతూ 5 వ షెడ్యూల్డ్ ప్రాంతంలో ఆదివాసి 9 తెగల విద్యావంతులు ఉన్నత విద్యను అభ్యసించి,నిరుద్యోగులుగా మిగిలిపోయే ప్రమాదం ఏర్పడింది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసి విద్యా విధానంపై, శ్వేత పత్రం విడుదల చేసి,విద్య ఉద్యోగ విధానం పై ఖచ్చితమైన చట్టాలు తీసుకురావాలని,లేనిపక్షంలో షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసి నిరుద్యోగుల నుంచి పూర్తి స్థాయిలో తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులకు 100% స్థానిక సర్పంచుల రిజర్వేషన్ అమ్మలులో ఉన్నప్పుడు,ఆదివాసి ఉద్యోగ రిజర్వేషన్ ఎందుకు పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు, ఆదివాసి జీవన విధానాన్ని పరిగణలోకి తీసుకొని ప్రత్యేక ఆదివాసి ఉద్యోగ రిజర్వేషన్ కేటాయించాలని కోరారు. తమిళనాడు రాష్ట్రంలో 69 శాతం రిజర్వేషన్ అమల్లో ఉందని, అక్కడ జీవన విధానం కంటే షెడ్యూల్ ఏరియాలో ఆదివాసి జీవన విధానము చాలా వెనుకబడి ఉందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేశారు.దీనిని దృష్టిలో పెట్టుకొని ఆదివాసులకు ప్రత్యేక ఉద్యోగ రిజర్వేషన్ చట్టం ద్వారా కేటాయించి భారత రాజ్యాంగ 9 షెడ్యూల్లో పొందుపరచాలని అన్నారు.,ఎన్నికల ప్రచారంలోకి వచ్చే ఎమ్మెల్యే అభ్యర్థులు ఏజెన్సీ స్పెషల్ డిఎస్సి మరియు భద్రాచలం కేంద్రంగా లా కాలేజ్ మంజూరు చేసి, ఆదివాసి నిరుద్యోగులకు హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమంలో గొండ్వానా విద్యార్థి సంక్షేమ పరిషత్ రాష్ట్ర నాయకులు. ఏక నర్సిహారావు, బాడిస సురేష్, గొండ్వానా సంక్షేమ పరిషత్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పూనెం ప్రతాప్,ప్రధాన కార్యదర్శి కనితి వెంకటకృష్ణ,పర్శిక అనిల్,తదితరులు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now