రోడ్డు ప్రమాద బాధితునికి చీమల రాజు బృందం సహాయం

రోడ్డు ప్రమాద బాధితునికి చీమల రాజు బృందం సహాయం

రోడ్డు ప్రమాద బాధితునికి చీమల రాజు బృందం సహాయం

కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : కాటారం మండల కేంద్రంలో నాలుగు రోజుల క్రిందట రోడ్డు ప్రమాదంలో సబ్ స్టేషన్ పల్లె కి చెందిన తోట రవికి తీవ్ర గాయాలు కాగా చికిత్సలో రెండు తొలగించగా సోమవారం చీమల రాజు బృందం ఆర్థిక సహాయం అందించారు. బాధితుడు నిరుపేద కావడంతో ఆర్థిక సహాయం చేయడం కోసం చీమల రాజు కాస్త ముందుకు వచ్చి తన మిత్రు బృందం తో సోషల్ మీడియా ద్వారా పిలుపు నిచ్చారు. కాటారం పరిసర ప్రాంత గ్రామాలలో వ్యాపారస్తులు, ప్రజలు, మిత్రుల ద్వారా విరాళాలు సేకరించారు. సేకరించిన విరాళాలు రూ. లక్ష 55 వేలను జమ చేసి బాధితుడు రవి తల్లి రాధమ్మ, ఆమె కుమారుడు జయకృష్ణకి అందజేశారు. ఈ విరాళాలు సేకరించిన చీమల రాజు బృందం పెండ్యాల రంజిత్, మాచర్ల రాజేందర్, తోట రాజేష్, ఆత్మకూరి కుమారు, దబ్బేట మహేష్, చీమల శ్రీను తదితరులు విరాళాలు సేకరించడంలో చీమల రాజు కు సహాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జనగామ కరుణాకర్ రావు, బచ్చు ప్రకాష్, చీమల రాజయ్య, అమీర్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment