క్రీడాకారులకు వాలీబాల్ కిట్లను అందజేత
– బీజేపీ డా జాడి రామరాజు నేత
తెలంగాణ జ్యోతి, కన్నాయిగూడెం : మండలంలోని బుట్టాయిగూడెం గ్రామపంచాయతీ పరిధిలో బీజేపీ మండల అధ్యక్షురాలు మాజీ సర్పంచ్ దుర్గం సమ్మక్క ఆధ్వర్యంలో వాలీబాల్ క్రీడాకారులకు బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి డా.జాడి రామరాజు నేత వాలిబాల్ కిట్ ను అందజేశారు. ఈ సమావేశంలో మండల ప్రధానకార్యదర్శి కుమ్మరి సత్యం, మహిళా మోర్చా అధ్యక్షురాలు పానుగంటి సంగీత, యువ మోర్చా అధ్యక్షులు జనగాం ఆనంద్, యువమోర్చా నాయకులు తిప్పనపల్లి సతీష్, చిట్యాల రూపేష్, జనగాం శినేష్, క్రీడాకారులు పాల్గొన్నారు.
1 thought on “క్రీడాకారులకు వాలీబాల్ కిట్లను అందజేత”