సంచార జాతి కుటుంబంపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

సంచార జాతి కుటుంబంపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

సంచార జాతి కుటుంబంపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

– సంచార జాతుల సంఘం జిల్లా అధ్యక్షులు రాజ్ కుమార్

ములుగు ప్రతినిధి : నిజామాబాద్ జిల్లా ఇందల్ వాయి మండలంలోని నల్లవెల్లి గ్రామంలో వీడిసి పేరుతో కొందరు వ్యక్తులు సంచారజాతి కులాల్లో భాగమైన ఓడ్ కులానికి చెందిన కుటుంబంపై దాడి చేసి తీవ్ర దుర్భాషలాడినారని, వారి గృహాన్ని ట్రాక్టర్ తో కూల్చి వేసిన వారిని గుర్తించి పోలీసులు చట్టరీత్య చర్యలు తీసుకోవాలని సంచార జాతుల సంఘం ములుగు జిల్లా అధ్యక్షుడు బాణాల రాజ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. సంచార జాతుల కులాల వారిని తీవ్రంగా భయభ్రాంతులకు గురిచేసి వారిపై దాడి చేసిన వారిని పై కఠినంగా చర్యలు తీసుకోవాలని, సంచారం చేస్తూ ఊరు ఊరు తిరుగుతూ జీవనం కొనసాగిస్తున్న వారిని ఇబ్బందులకు గురి చేయడం దారుణం అన్నారు. ప్రభుత్వం అండగా ఉండాల్సింది పోయి ప్రభుత్వ అండదండలతో మా నివాసాలను కూల్చివేస్తూ మా పైన దాడి చేస్తూన్నారని ఆరోపించారు.. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం అత్యంత వెనుకబాటు అయిన మా సంచార జాతులకు కూడా అలాంటి ఒక చట్టాన్ని తీసుకురావాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇకమీదట మా సంచార జాతి కులాలలో ఏ ఒక్కరి పైన ఏ ఒక్కరి ఇంటి పైన దాడి జరిగిన ఊరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment