పాఠశాల బస్సులు శుభకార్యాలకు వాడితే కఠిన చర్యలు
– ఆర్ టీ ఓ సంధాని మహమ్మద్
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : పాఠశాల బస్సు స్కూల్ పిల్లలను మాత్రమే తరలించ డానికి ఉపయోగించాలని, వాహనం వెంట అన్ని పత్రాలు కలిగి ఉండాలని జిల్లాలోని పాఠశాల యాజమాన్యాలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా రవాణా శాఖ అధికారి సంధాని మహమ్మద్ సూచించారు. స్కూల్ బస్సు నడిపే డ్రైవరు కనీసం ఐదు సంవత్సరాలు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ పై అనుభవం కలిగి ఉండాలని, లేనియెడల మోటార్ వాహన చట్టం ప్రకారం సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరికలు జారీ చేశారు. మీ వాహన పన్నులు సకాలంలో చెల్లించాలని, అన్ని పత్రాలు కలిగి ఉండాలని, లేనియెడల కేసు చేస్తే రెండు వందల శాతం అదనపు రుసుము చెల్లించాల్సి వస్తుందని సాధారణ వాహన యజమానులకు జిల్లా రవాణాశాఖ అధికారి సంధాని మహమ్మద్ సూచించారు.