కుంభాభిషేకానికి తుని పీఠాధిపతికి ఆహ్వానం

కుంభాభిషేకానికి తుని పీఠాధిపతికి ఆహ్వానం

కాళేశ్వరం, తెలంగాణ జ్యోతి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం క్షేత్రంలో ఫిబ్రవరి 7, 8, 9, తేదీలలో జరిగే కుంభాభిషేకం నిర్వహించాలని కోరుతూ కాళేశ్వరం దేవస్థానం కార్యనిర్వాహణాధికారి ఎస్, మహేష్, ఉప ప్రధానార్చకులు పనకంటి పనింద్ర శర్మలు  శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామిని ఆహ్వాన పత్రికను అందజేశారు. దేవదాయ శాఖ, శృంగేరి పీఠాధిపతుల ఆదేశాల మేరకు ఆర్ జె సి రామకృష్ణ రావు, యాదగిరి వేద పాఠశాల చైర్మన్ కుంబాభిషేకం మెంబర్ గోవిందా హరి ఆధ్వర్యంలో వారు రాజమహేంద్రవరం సమీపంలోని తుని తపోసన ఆశ్రమ పీఠానికి వెళ్లి కాళేశ్వరంలో కుంభాభిషేకం నిర్వహించాలని కోరారు. ఈనెల 20న కర్ణాటకలోని శృంగేరి పీఠానికి వెళ్లి శ్రీ విధుశేఖర భారతి తీర్థ స్వామిని ఆహ్వానించగా, ఆయన ప్రయాగ్రాజ్ మహా కుంభమేళలో ఉండడంతో అనుబంధ పీఠమైన తుని పీఠాధిపతిని ఆలయ అధికారులు ఆహ్వానించారు.

[metaslider id="19893"]

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment