జిల్లాలో ఎలక్షన్ కోడ్ అమలు

జిల్లాలో ఎలక్షన్ కోడ్ అమలు

– రాజకీయ పార్టీల దిమ్మలకు, విగ్రహాలకు ముసుగులు

– పార్టీల ఫ్లెక్సీలు బ్యానర్లు తొలగింపు. 

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం, వాజేడు మండలాల్లో ఎంఎల్సీ ఎలక్షన్ కోడ్ అమలుతో గురువారం రాజకీయ పార్టీల దిమ్మ లకు, రాజకీ య నేతల విగ్రహాలకు, రాజకీయ పార్టీల ప్లెక్సీలు,జెండాలు తొల గించి ఎలక్షన్ కోడ్ నిభంధనలను అమలు చేశారు. ములుగు జిల్లా కలెక్టర్ ఆదేశంపై వెంకటాపురం మేజర్ పంచాయతీ కార్య దర్శి గగ్గూరి ప్రవీణ్ ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బంది, వేప చెట్టు సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహంతో పాటు, గెస్ట్ హౌస్ ఎదురుగా ఉన్న ఇందిరాగాంధీ విగ్రహానికి ముసుగులు కట్టారు. అలాగే బస్టాండ్ ఎదురుగా ఉన్న సిపిఎం పార్టీ దిమ్మకు సైతం ముసుగులు కట్టి పార్టీల ఫ్లెక్సీలు తొలగించారు. ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాలలో శాసన మండలి ఎన్నికల కోడ్ అమల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఉన్నతాధికారుల ఆదేశంపై అమలు చేశారు. ప్రదర్శనలు ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనలు అమలు చేసేందుకు అధికారులు ముందుగానే ఆయా రాజకీయ పార్టీల నేతలకు సమాచారం ఇచ్చారు.

[metaslider id="19893"]

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment