బహిర్బూమికై వెళ్లి అడవిలో ఒకరి మృతి..!
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం బెస్తగూడెం గ్రామ పక్కనే ఉన్న అడవి ప్రాంతంతో బహిర్బూమికై వెళ్లి ఒకరు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… గ్రామానికి చెందిన గుండారపు వెంకటేశ్వర్లు (45) గత మూడు రోజుల నుండి కనిపించడం లేదని వెతుకుతున్న క్రమంలో, శనివారం అటువైపు నుండి వెళ్తున్న గ్రామస్తులు మృత దేహాన్ని గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కనిపించడం లేదని బాధలో ఉన్న కుటుంబసభ్యులకు మృతదేహంగా వెంకటేశ్వర్లు కనిపించడంతో కన్నీరు మున్నీరుగా విలపిం చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వెంకటేశ్వర్లు మృతి పట్ల దర్యాప్తును ప్రారంభించారు. పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్ని వెంకటాపురం ప్రభుత్వ ఆస్ఫత్రికి తరలించారు. ఈ సంఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.