నిజాం నిరంకుశత్వం పై పోరాడి గెలిచిన గోండు వీరుడు

Written by telangana jyothi

Published on:

నిజాం నిరంకుశత్వం పై పోరాడి గెలిచిన గోండు వీరుడు

  • కొమరం భీమ్ ఆశయాలను సమాధి చేస్తున్న రాజకీయ పార్టీలు.
  • నివాళులు అర్పించిన ఆదివాసీ నాయకులు

వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిది : ఆదివాసీల ఓట్లు అడిగే నైతిక హక్కు పోదేం వీరయ్యకు లేదని ఆదివాసీ సంఘాలు ధ్వజమెత్తారు. జల్ జంగిల్ జమిన్ నినాదం తో నిజాం నిరంకుశ విధానాలకు వ్యతిరేకం గా పోరాడిన, గోండు వీరుడు కొమరం భీమ్ అని ఆదివాసీ నాయకులు కొనియాడారు .ఆయన పోరాట ఫలితంగానే నేడు ఆదివాసీలకు రాజ్యాంగ బద్ధమైన హక్కులు లభించాయని తెలిపారు.ఆదివారం కొమరం భీమ్ వర్ధంతి సభ తుడుం దెబ్బ ఆధ్వర్యంలో సిద్దబోయిన సర్వేష్ అధ్యక్షతన ,వెంకటాపురం లో ఘనంగా జరిగింది.దీనికి వివిధ ఆదివాసీ సంఘాల నాయకులు హాజరై మండల కేంద్రంలో ని కొమరం భీమ్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం సర్పంచ్ నర్సింహామూర్తి, సోమరాజు, న్యాయవాది సమ్మయ్య మాట్లాడుతూ నిజాం నవాబ్ పాశవిక విధానాల పైన, పోరాటం చేసి అసువులు బాసిన కొమరం భీమ్ వారసులు అయిన ఆదివాసీలు నేడు తెలంగాణ లో అస్థిత్వం కోసం పోరాటం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు . కొమరం భీమ్ ఆశయాలు అమలు కు నోచు కోక పోవడం తో ఆదివాసీలు నిరాశ్రయులు అయ్యారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం లో ఎన్నికలు వచ్చినప్పటికి రాజకీయ పార్టీలు ఆదివాసీలకు ఎటువంటి భరోసా ఇవ్వలేక పోతున్నాయని మండిపడ్డారు. పదేళ్లు అధికారం లో ఉన్న బీ ఆర్ ఎస్ పార్టీ ప్రభుత్వం ఆదివాసీలకు అండగా నిలువక పోగా, ఆదివాసీల హక్కులను కాలరాసిందని అన్నారు. అధికార పార్టీ అరాచకాలను ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చోద్యం చూసాయని అన్నారు. నోరులేని అడవి బిడ్డల పక్షాన మాట్లాడాల్సిన ప్రతిపక్ష పార్టీలు మాట్లాడక పోవడం దుర్మార్గం అన్నారు. .11 గిరిజనేతర కులాలను ఎస్టీ జాబితాలో కలపాలని శాసన సభ తీర్మానం చేస్తున్న సమయం లో , ఎమ్మెల్యే పోదేం వీరయ్య ఎందుకు అడ్డు చెప్పలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదివాసీల హక్కులను,చట్టాలను కాపాడలేని పోదేం వీరయ్యకు ఓటు వేస్తే ఆదివాసీలు మరొక ఐదు ఏళ్ళు నష్ట పోక తప్పదన్నారు.ఏజెన్సీ చట్టాలు నిర్వీర్యం అవుతుంటే స్థానిక ఎమ్మెల్యే పోదేం వీరయ్య నోరు మెదపక పోవడం సిగ్గు చేటు అన్నారు. గిరిజనేతరుల పక్షాన నిలబడే పోదేం వీరయ్యకు ఆదివాసీల ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు . పార్టీ ఏదైనా గెలిసిన ప్రతి ఎమ్మెల్యే గిరిజనేతరులకు బానిసలుగా మారిపోతున్నారని విమర్శించారు. గిరిజనుల పక్షాన నిలబడని అధికార, ప్రతిపక్ష పార్టీలకు ఆదివాసీలు ఈ ఎన్నికల్లో బుద్ది చెప్తారని అన్నారు. అన్ని రాజకీయ పార్టీల లక్ష్యం గిరిజనులకు వ్యతిరేకం గా పని చేయడమే అని తెలిపారు. రాజకీయ పార్టీలను అడ్డుపెట్టుకొని ఆస్తులు సంపాదించు కోవడం, భూములు కబ్జా చేయడం వలస గిరిజ నేతరుల ప్రధాన లక్ష్యం అన్నారు.తమ ఆస్తులను కాపాడు కోవడం కోసమే ఏజెన్సీ లో కొంతమంది వలస గిరిజనేతరులు దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు వలస గిరిజనేతరులు పార్టీలు పంచుకుంటున్నారని అన్నారు.ఆదివాసీ చట్టాలని అమలు చేస్తామని , ఏజెన్సీ నీళ్లు, నిధులు, నియామకాలు ఆదివాసీలకు చెందాలని ఏ ఒక్క రాజకీయ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టో లో పొందు పరచక పోవడం చూస్తే ఆదివాసీల పైన పార్టీలకు ఉన్న చిత్తశుద్ధి ఏ పాటిదో అర్ధం అవుతోందని వారు అన్నారు. ఆదివాసీల పక్షాన నిలబడే వారికే ఆదివాసీలు ఓటు వేస్తారని తెలిపారు.ఆదివాసీ న్యాయవాది వాసం నాగరాజు,నాయకులు సిద్దబోయిన సర్వేష్, కుచ్చింటి చిరంజీవి, చిట్టిబాబు, విష్ణు, తదితరులు పాల్గొన్నారు.

నిజాం నిరంకుశత్వం పై పోరాడి గెలిచిన గోండు వీరుడు

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now