మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక అమలు

Written by telangana jyothi

Updated on:

మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక అమలు

– ప్రభుత్వం అందిస్తున్న పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలి.

– జిల్లా కేంద్రంలో రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేస్తాం.

– అధికారులు మంచి మనసుతో పనిచేస్తూ ప్రజలలో స్థిర స్థాయిగా నిలిచిపోవాలి.

– రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క.

    ములుగు ప్రతినిధి, తెలంగాణజ్యోతి : రాష్ట్రంలోని మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొం దించిందని, మహిళా సంఘాల సభ్యులు అన్ని రంగాల్లో ఎదగ డానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో ఇందిరమ్మ మహిళాశక్తి క్యాంటీ న్ ను జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, ఎస్పీ డాక్టర్ శబరీష్, అదనపు కలెక్టర్ సంపత్ రావులతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ మహిళా క్యాంటీలను ఏర్పాటు చేస్తున్నామని, మహిళలు అన్ని రంగాలలో ఎదగ డానికి ప్రత్యేక చోరువ తీసుకుంటున్నామని వివరించారు. జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడంలో భాగంగా కార్పొరేట్ కంపెనీల సహాయంతో 8 గ్రామాలను దత్తత తీసుకొని రెండున్నర కోట్ల రూపాయలతో ఆయా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయడం జరుగుతుందని, జిల్లా కేంద్రంలో రోడ్డు విస్తరణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని జిల్లాలోని అన్ని గ్రామాలలో రోడ్డు డ్రైనేజీ పనులను చేపట్టి సంవత్సర కాలంలో పూర్తి చేస్తామని అన్నారు. జిల్లా ప్రజలు అనేక సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న జిల్లా కేంద్రంలోని బస్టాండ్ నిర్మాణ పనులు ఐదు కోట్ల 11 లక్షల రూపాయలతో హైటెక్ తరహాలో నిర్మించడంతో పాటు ఏటూరు నాగారంలో బస్ డిపో ఏర్పాటు కోసం ఏడు కోట్ల రూపాయల నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. అభివృద్ధి పనులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ నాణ్యత తొ పూర్తి చేయాలని సూచించారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ములుగు జిల్లాలో పర్యాటక ప్రాంతం అభివృద్ధి చెందుతున్నదని యోనిస్కో గుర్తింపు పొందిన రామప్ప తో పాటు లక్నవరం, సమ్మక్క సారలమ్మ జాతర, బొగత జలపాతం పర్యాటకులను ఆకట్టుకునే విధంగా దట్టమైన అటవీ ప్రాంతంలో బ్లాక్ బెర్రీని ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. జిల్లాలోని నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు పొందడానికి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని త్వరలోనే ప్రారంభించబోతున్నామని, ఈ శిక్షణ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ రంగాలలో ఉద్యోగాలు పొందే అవకాశం ఉందని అన్నారు. జిల్లాలో అభివృద్ధి కార్యక్ర మాలను చేపడుతూనే ప్రభుత్వ పథకాలు అర్హులకు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నా మని అన్నారు.జిల్లాలో పనిచేస్తున్న అన్ని శాఖల అధికారులు మంచి మనసుతో పనిచేస్తూ ప్రజలలో స్థిరస్థాయిగా నిలిచిపోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ జగదీష్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్లాల్, డిపిఓ దేవరాజ్, ఏపీడి బాల స్వామి, కిసాన్ సెల్ అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షులు బాదం ప్రవీణ్, ప్రజా ప్రతి నిధులు, మహిళా సంఘాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now