గౌడ సంఘం జిల్లా అధ్యక్షున్ని సన్మానించిన మంత్రి సీతక్క
ములుగు, తెలంగాణజ్యోతి:తెలంగాణ గౌడ సంఘం ములుగు జిల్లా అధ్యక్షునిగా నూతనంగా ఎంపికైన తోటకూరి శ్రీకాంత్ గౌడ్ పంచాయితి రాజ్ శాఖ మంత్రిని సోమవారం ములుగులోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవగా శ్రీకాంత్ ను మంత్రి సీతక్క శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ యువత ముందుకు వచ్చి సమాజ సేవలో, సమాజ హితం కోసం పనిచేయాలని కోరారు. కుల వృత్తులను ప్రోత్సహిస్తూ ప్రభుత్వం ఎన్నో చేయూ త కార్యక్రమాలను నిర్వహిస్తుందని, కుల వృత్తుల వారు వాటిని ఉపయోగించుకోవాలన్నారు. తెలంగాణ గౌడ సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు తోటకూరి శ్రీకాంత్ గౌడ్ గౌడల సమస్యలపై రాజకీయాలకతీతంగా జాతి కోసం పని చేయాలని, ప్రభుత్వం సంక్షేమ పధకాలు అందించాలని, తాటి గీత కార్మికులకు ఎజెన్సీ ప్రాంతాలలో సోసైటీలను ఏర్పాటు చేయాలని మంత్రి సీతక్కను కోరారు. అదేవిధంగా జిల్లా కేంద్రంలో సర్వాయి పాపన్న విగ్రహా న్ని ఏర్పాటు చేయాలని తెలిపగా, సానుకూలంగా స్పందించిన మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జేఏసీ గౌడ ఐక్య వేదిక ములుగు జిల్లా అధ్యక్షులు ముంజాల బిక్షపతి గౌడ్, అంతటి రమేష్ గౌడ్, రాజు, తదితరులు పాల్గొన్నారు.