గురువు కుటుంబానికి విద్యార్థుల ఆర్థికసాయం
– రూ.1.85లక్షలు అందజేత
ములుగు ప్రతినిధి, తెలంగాణజ్యోతి : విద్యాబుద్ధులు నేర్పిన గురువు అనారోగ్యంతో మృతి చెందడంతో విద్యార్థులు వారి కుటుంబానికి ఆసరగా నిలిచారు. 1999–2001 విద్యా సంవ త్సరంలో ములుగులోని కాకతీయ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ గణిత శాస్త్రం బోధించిన లెక్చరర్ నూనె రవీందర్ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. ఆదివారం వరంగల్ లో జరిగిన రవీందర్ సంస్మరణ సభలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించిన 2001 ఇంటర్ విద్యార్థుల బృందం ఆర్థిక సాయం అందజేశారు. రూ.1.85 లక్షల మొత్తాన్ని ఉపాధ్యాయుడు రవీందర్ భార్య వాణి, కుమార్తెలు హారిని, హాసినీలకు అందజేశారు. ప్రైవేటు కళాశాలలో విద్యా బోధన చేస్తూ కుటుంబాన్ని పోషించిన గురువు ఆర్థిక స్థోమతను తెలుసుకున్న పూర్వ విద్యార్థులు వారి వంతుగా సహాయం అందించడాన్ని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ యేశబోయిన సాంబయ్య, ఉపాధ్యా యులు రాజిరెడ్డి, విద్యాసాగర్, పూర్వ విద్యార్థులు యాసం రాజ్ కుమార్, వంగల వేణు. మహ్మద్ చాంద్ పాష, రఫద్ సంతోష్, ప్రభాకర్, రజిని, సతీష్, మధు, శ్రీనివాస్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.