వాట్సాప్ లో వ్యక్తిగత దూషణ చేసిన వ్యక్తిపై, గ్రూప్ అడ్మిన్ పై కేసు నమోదు

Written by telangana jyothi

Published on:

వాట్సాప్ లో వ్యక్తిగత దూషణ చేసిన వ్యక్తిపై, గ్రూప్ అడ్మిన్ పై కేసు నమోదు

  • గణపురం ఎస్ఐ మచ్చ సాంబమూర్తి 

భూపాలపల్లి ప్రతినిధి : భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ గ్రామానికి చెందిన సత్య నారాయణ రెడ్డి ఫిర్యాదు మేరకు చెల్పూర్ సమాచార గ్రూప్ వాట్సాప్ గ్రూప్ లో వ్యక్తిగత దూషణలకు సంబందించిన అసబ్య పదజాలం తో కూడిన ఆడియో ను పోస్ట్ చేసినందుకు గాను ఎంజాల సురేష్ , చెల్పూర్ సమాచార గ్రూపు అడ్మిన్ అయినా జెట్టి కనకరాజులపై కేసులు నమోదు చేశారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందువల్ల ఘన్పూర్ మండలానికి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపు లలో ఎవరైనా గానీ వ్యక్తిగత దూషణలు మరియు శాంతి భద్రతలకు విగతం కలిగించే విధంగా మెసేజ్ మరియు ఆడియోలు, వీడియోలు పోస్ట్ చేసినట్లయితే వారి మీద మరియు గ్రూప్ అడ్మిన్ ల పై చట్టరీత్య కఠినమైన చర్యలు తీసుకుంటాము అని మండలం లోని వాట్సాప్ గ్రూప్ ల మీద పోలీస్ వారి ప్రత్యేక మైన నిఘా ఏర్పాటు చేయడం జరిగింది అని గణపురం ఎస్ఐ మచ్చ సాంబమూర్తి  తెలుపుతూ వాట్సాప్ లో పోస్ట్ చేసేటప్పుడు జాగ్రత్త గా ఉండాలి అని హెచ్చరించారు.

Tj news

1 thought on “వాట్సాప్ లో వ్యక్తిగత దూషణ చేసిన వ్యక్తిపై, గ్రూప్ అడ్మిన్ పై కేసు నమోదు”

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now