తాగి డ్రైవింగ్ చేస్తే.. ఇక జైలే…
– ఎస్ ఐ అభినవ్ హెచ్చరిక
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : మధ్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి జరిమానా తో పాటు రెండు రోజులు జైలు శిక్ష విధించినట్లు కాటారం ఎస్ ఐ మ్యాక అభినవ్ వివ రించారు. కాటారం పోలీస్ వారు వెహికల్ చెకింగ్ చేస్తుండగా మద్యం సేవించి వాహనం నడిపిన మహాదేవపూర్ మండలం బెగుళూర్ కు చెందిన వెంకయ్య (28) డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలో చిక్కినట్లు తెలిపారు. ఈనెల4న భుపాలపల్లి మేజిస్ట్రేట్ ముం దు హాజరు పరుచగా అతనికి వెయ్యి రూపా యలు జరిమానా తో పాటు రెండు రోజులు జైలు శిక్ష విధించగా అతనిని పరకాల సబ్-జైలు కు తరలించారని వివరించారు. అభినవ్ కాటారం ప్రజలకు తెలియజేయునది ఏమనగా లైసెన్స్, హేల్మట్, నెంబర్ ప్లేట్, ఇతర పత్రాలు లేకుండా ట్రాఫిక్ నిబం దనలకు వ్యతి రేకంగా వాహనాలు నడిపిన లేదా అధిక వేగంతో గాని, మద్యం సేవించి గాని వాహనాలు నడిపె వ్యక్తులపై చట్ట రిత్యా కటిన చర్యలు తీసుకోబడును అని తెలిపారు.